twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్బార్ మోషన్ పోస్టర్: ముగ్గురు ఇండియన్ సూపర్‌స్టార్లతో రిలీజ్.. వారెవరంటే..

    |

    కబాలి, కాలా, పేట్ట చిత్రాలతో సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుస చిత్రాలతో జోరు పెంచారు. సంక్రాంతి బరిలోకి దూకి అభిమానులకు, ప్రేక్షకులకు చేరువయ్యేందుకు సిద్ధమయ్యారు. తన కెరీర్‌లో 167వ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రానికి ఏఆర్ మురగదాస్ దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫిని అందిస్తుండగా, అనిరుధ్ మ్యూజిక్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అయితే ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రారంభించేందుకు ప్లాన్ రెడీ చేశారు. ఇంతకు దర్బార్ ప్రమోషన్ విశేషాలు ఏమిటంటే..

    భారతీయ సినీ దిగ్గజాలతో

    భారతీయ సినీ దిగ్గజాలతో

    సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్భార్ మోషన్ పోస్టర్‌ను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ రెడీ చేశారు. ఈ సినిమా మోషన్ పోస్టరన్‌ను భారతీయ సినిమా పరిశ్రమలో దిగ్గజ సూపర్‌స్టార్లతో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కమల్ హాసన్, సల్మాన్ ఖాన్, మోహన్ లాల్‌ను బరిలోకి దించారు.

    ఏఆర్ మురుగదాస్ ట్వీట్

    ఏఆర్ మురుగదాస్ ట్వీట్

    దర్బార్ మోషన్ పోస్టర్ గురించి దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ట్వీట్ చేశారు. దర్బార్ మోషన్ పోస్టర్‌ను భారతీయ సినీ దిగ్గజాల చేత ఆవిష్కరింప చేస్తున్నానని చెప్పడానికి గర్వంగా ఉంది. ఇందు కోసం కమల్ హాసన్ సర్, సల్మాన్ ఖాన్ సర్.. మోహన్ లాల్ సర్‌ను ఒప్పించాం. గురువారం అనిరుధ్ మాస్ మ్యూజిక్‌తో తలైవర్ రజనీకాంత్ రాక కోసం వేచి చూడండి అని మురుగదాస్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    క్లాస్, మాస్ అంశాలతో

    క్లాస్, మాస్ అంశాలతో

    దర్బార్ సినిమా షూటింగ్‌ ఇటీవలే ముంబై, ఉత్తరాదిలో పూర్తి చేసుకొన్నది. మాస్, క్లాస్ అంశాలను మేలవించిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ రెండు పాత్రల్లో కనిపిస్తారు. పోలీస్ అధికారి, టీచర్ పాత్రల్లో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. 1992లో పాండ్యన్ సినిమా తర్వాత రజనీకాంత్ ఈ పోలీసు క్యారెక్టర్‌లో రజనీకాంత్ నటించడం ఇదే తొలిసారి.

    నటీనటులు, రిలీజ్ డేట్

    నటీనటులు, రిలీజ్ డేట్

    దర్బార్ చిత్రంలో రజనీకాంత్‌తోపాటు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నయనతార, ప్రతీక్ బబ్బర్, నివేదా థామస్, దిలీప్ తాహిల్, నవాబ్ షా, గురు భుల్లార్, యోగిబాబు, శ్రీమన్, జతిన్ శర్మ, తదితరులు నటిస్తన్నారు. ఈ చిత్రం సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 15న రిలీజ్ కానున్నది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై అల్‌రాజా సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.

    English summary
    Darbar motion poster to release on November 7th. AR Murugadoss tweeted that Previlaged to announce that our #DarbarMotionPoster will be unveiled by top celebrities of our Indian cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X