twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్బార్ మోషన్ పోస్టర్ రిలీజ్.. రజనీకాంత్ స్టయిల్‌తో అదరగొట్టాడు.. షాకిచ్చిన మహేష్‌బాబు

    |

    కబాలి, కాలా, పేట్ట చిత్రాలతో సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుస చిత్రాలతో జోరు పెంచారు. సంక్రాంతి బరిలోకి దూకి అభిమానులకు, ప్రేక్షకులకు చేరువయ్యేందుకు సిద్ధమయ్యారు. తన కెరీర్‌లో 167వ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రానికి ఏఆర్ మురగదాస్ దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫిని అందిస్తుండగా, అనిరుధ్ మ్యూజిక్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అయితే ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రారంభించేందుకు ప్లాన్ రెడీ చేశారు. ఈ క్రమంలోనే దర్భార్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆ మోషన్ పోస్టర్ మీకోసం..

    భారతీయ సినీ దిగ్గజాలతో

    భారతీయ సినీ దిగ్గజాలతో

    సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్భార్ మోషన్ పోస్టర్‌ను భారీ ఎత్తున గురువారం రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో మోషన్ పోస్టర్‌ను భారతీయ సినిమా పరిశ్రమలో దిగ్గజ సూపర్‌స్టార్లు కమల్ హాసన్, సల్మాన్ ఖాన్, మోహన్ లాల్‌ చేతుల మీదుగా విడుదల చేయించారు. ఇలా ముగ్గురు సూపర్ స్టార్లతో రిలీజ్ చేయడం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. అయితే ట్వీట్‌లో పేర్కొన్న దానికి భిన్నంగా అందరికీ షాకిస్తూ.. తెలుగు మోషన్ పోస్టర్‌ను కమల్‌తో కాకుండా మహేష్ బాబు చేత రిలీజ్ చేయించడం చర్చనీయాంశమైంది.

    మహేష్ చేతుల మీదుగా దర్బార్ మోషన్ పోస్టర్‌

    దర్బార్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయిన కొద్ది సేపట్లోనే ప్రిన్స్ మహేష్ బాబు ట్విట్టర్‌లో స్పందించారు. రజనీకాంత్ సార్ నటించిన దర్భార్ తెలుగు వెర్షన్ మోషన్ పోస్టర్‌ను నా చేత ప్రజెంట్ చేయించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఏఆర్ మురగదాస్, చిత్ర యూనిట్ సభ్యులందరికి నా శుభాభివందనాలు అంటూ ప్రిన్స్ మహేష్ బాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.

    నలుగురు సూపర్‌స్టార్లతో

    దర్బార్ మోషన్ పోస్టర్ గురించి దర్శకుడు ఏఆర్ మురుగదాస్ బుధవారం ట్వీట్ చేశారు. దర్బార్ మోషన్ పోస్టర్‌ను భారతీయ సినీ దిగ్గజాల చేత ఆవిష్కరింప చేస్తున్నానని చెప్పడానికి గర్వంగా ఉంది. తమిళంలో కమల్ హాసన్ సర్, హిందీలో సల్మాన్ ఖాన్ సర్.. మలయాళంలో మోహన్ లాల్ సర్‌ను ఒప్పించాం అని తెలిపారు. కాగా వీరితో కాకుండా మహేష్ బాబు కూడా ఈ వేడుకలో చేరడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

    మోషన్ పోస్టర్‌లో పోలీసు మెరుపులు

    మోషన్ పోస్టర్‌లో పోలీసు మెరుపులు

    దర్భార్ చిత్రంలో రజనీకాంత్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. పోలీస్ అధికారి, టీచర్ పాత్రల్లో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. 1992లో పాండ్యన్ సినిమా తర్వాత రజనీకాంత్ ఈ పోలీసు క్యారెక్టర్‌లో రజనీకాంత్ నటించడం ఇదే తొలిసారి. అయితే తాజా దర్బార్ మోసన్ పోస్టర్‌లో పోలీస్ అధికారి పాత్రను పరిచయం చేయడం గమనార్హం.

    సంక్రాంతి బరిలో

    సంక్రాంతి బరిలో

    భారీ అంచనాలతో రూపొందింన దర్బార్ చిత్రంలో రజనీకాంత్‌తోపాటు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నయనతార, ప్రతీక్ బబ్బర్, నివేదా థామస్, దిలీప్ తాహిల్, నవాబ్ షా, గురు భుల్లార్, యోగిబాబు, శ్రీమన్, జతిన్ శర్మ, తదితరులు నటిస్తన్నారు. ఈ చిత్రం సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 15న రిలీజ్ కానున్నది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై అల్‌రాజా సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.

    English summary
    Thalaivar, Superstar Rajinikanth latest movie is Darbar. Recently Production house Lyca tweet that Rajinikanth has finishes his part of the Shoot. And ready to enter in pongal race. Darbar motion poster released on November 7th. AR Murugadoss tweeted that Previlaged to announce that our #DarbarMotionPoster will be unveiled by top celebrities of our Indian cinema. ikamalhaasan sir, BeingSalmanKhan sir, and Mohanlal sir. Watch out our thalaivar rajinikanth tomorrow with anirudhofficial mass theme. LycaProductions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X