27 ఏళ్ల తర్వాత పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో రజనీ... ‘దర్బార్’ షూటింగ్ షురూ (ఫోటోస్)
రజనీకాంత్ 167వ మూవీకి 'దర్బార్' అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ మంగళవారం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నేడు(ఏప్రిల్ 10) ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది.
ఫార్మల్ పూజా కార్యక్రమాలతో లాంచింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రజనీకాంత్ మళ్లీ పవర్ ఫుల్ కాప్‌గా కనిపించబోతున్నారు.

పూజా కార్యక్రమాలతో ప్రారంభం
బుధవారం జరిగిన ‘దర్బార్' లాంచింగ్ ఈవెంటులో రజనీకాంత్, లైకా ప్రొడక్షన్స్ అధినేత అల్లిరాజా శుభకరణ్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్, సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

27 ఏళ్ల తర్వాత పోలీస్ పాత్రలో రజనీ
రజనీకాంత్ చివరగా 1992లో వచ్చిన ‘పాండ్యన్' చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించారు. మళ్లీ 27 ఏళ్ల గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండటంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నయనతార
దర్బార్ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ తమిళ కమెడియన్ యోగిబాబు కూడా కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇతర తారాగణం వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు.

దర్బార్
దర్బార్ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్ నటించిన ‘పేట' సంక్రాంతికి విడుదలై భారీ విజయం అందుకుంది. ‘దర్బార్' చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు తెచ్చేలా షూటింగ్ ప్లాన్ చేశారు.


Click it and Unblock the Notifications











