'దరవు' దర్శకుడు నెక్స్ట్ స్టార్ హీరోతో ఖరారు
చెన్నై : రవితేజ 'దరవు' చిత్రం మార్నింగ్ షోకే ప్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తర్వాత ఎంత పబ్లిసిటీ చేసినా నిలబడలేదు. అయితేనేం ఆ చిత్రం దర్శకుడు మంచి ఆఫర్ పొందారు. 'శౌర్యం'తో దర్శకుడైన ఛాయాగ్రాహకుడు శివ 'దరవు' చిత్రాన్ని రూపొందించారు. త్వరలో ఆయన అజిత్ హీరోగా ఓ చిత్రం చేయటానికి రంగం సిద్దమైంది. ఇందులో అనుష్క హీరోయిన్ గా నటించబోతోందని చెన్నై సమాచారం. పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో తెలుస్తాయి.
గతంలో రవితేజ 'విక్రమార్కుడు'ని తమిళంలో కార్తీ హీరోగా 'సిరుత్తై' అని శివ రీమేక్ చేశారు. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా మాస్ సినిమాలు బాగా డీల్ చేస్తాడనే పేరుని శివకు తెచ్చిపెట్టింది. దాంతో దరువు చిత్రంపై అజిత్ దృష్టి పెట్టాడు. తెలుగులో 'దరువు' చిత్రం బాగా ఆడితే అదే దర్శకుడితో తాను హీరోగా దానిని తమిళంలో రీమేక్ చేయాలని అజిత్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయం మీడియాకు దర్శకుడు శివ సైతం చెప్పారు. అయితే ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావటంతో అజిత్ విరమించుకున్నట్లు తమిళ మీడియాలో రూమర్స్ వచ్చాయి.
అయితే 'దరవు' రీమేక్ నే చేస్తారా లేదా మరో చిత్రం చేస్తారా అన్నది తేలలేదు. శివ దర్శకత్వంలో విజయ బ్యానర్ పై ఈ చిత్రం రీమేక్ చేద్దామని ప్లాన్ చేసారు. వరసగా స్టైలిష్ మాఫియా సినిమాలు చేస్తున్న అజిత్ ఈ పాత్ర తనకు డిఫెరెంట్ గా ఉంటుందని భావించి కథ విని ఓకే చేసాడు. అందులోనూ అజిత్ తాజా చిత్రం బిళ్లా 2 సైతం భాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. ఈ నేపధ్యంలో ప్లాప్ టాక్ తెచ్చుకున్న దరువు చేయాలా వద్దా అని చర్చించారని సమాచారం. శివ మరో కథ చెప్పి ఒప్పించాడని అక్కడ తమిళ మీడియా అంటోంది.
ఈ విషయమై శివ మాట్లాడుతూ...అజిత్ హీరోగా ఓ చిత్రం ఉంటుంది. విజయ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది అన్నారు. శౌర్యం' చిత్రంతో దర్శకత్వం వైపు అడుగులు వేసిన కెమెరామెన్ శివ. అంతకు ముందు ఛాయాగ్రాహకుడిగా 'శ్రీరామ్', 'నేనున్నాను' లాంటి చిత్రాలకు పని చేశారు. 'శంఖం', తమిళంలో 'సిరుతై' చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు రవితేజతో 'దరువు' చిత్రాన్ని రూపొందించారాయన.


Click it and Unblock the Notifications











