Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నిన్ను చంపేస్తాం.... "సుచీలీక్స్" సుచి కి బెదిరింపుకాల్స్
కొన్ని రోజుల క్రితం సుచీ లీక్స్ వ్యవహారం సౌత్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సుచిత్ర ఇక్కడ లేదు... కానీ ఆమె ని చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారట...
కొన్ని రోజుల క్రితం సుచీ లీక్స్ వ్యవహారం సౌత్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. సౌత్ ఇండియన్ ఫిలిమిండస్ట్రీలన్నీ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. అయితే నిజానికి సుచిత్ర ఏం తప్పుచేసిందీ..? వాళ్ళు చీకట్లో చేసిన తప్పులనే కదా బయట పెట్టిందీ... దీనంతతికీ ముఖ్యకారణం అయిన ధనుష్ మాత్రం ఇప్పటికీ నోరు మెదపలేదు.
సుచిత్ర ఇక్కడ లేదు
ఇప్పుడు సుచిత్ర ఇక్కడ లేదు... కానీ ఆమె ని చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారట... ఆ బెదిరింపులు ఎవరివో ప్రత్యేకంగా చెప్పాలా...? సింగర్ సుచిత్ర పేరు మీద జరిగిన ఈ లీక్స్ వ్యవహారంలో ధనుష్, అనిరుధ్, ఆండ్రియా, చిన్మయి, హన్సిక, త్రిష, రానా, సంచిత శెట్టి వంటి టాప్ స్టార్ల ప్రైవేట్ ఫోటోస్ లీక్ అయ్యాయి.
షాకింగ్ సీక్రెట్లు
ఫోటోలతో పాటు పలువురు స్టార్లకు సంబంధించిన సెన్షేషన్ విషయాలు, షాకింగ్ సీక్రెట్లు సుచీ లీక్స్ ద్వారా బయట పడటంతో యావత్ సినీ లోకం విస్తుపోయింది. తనకు మత్తు మందు ఇచ్చి ధనుష్, అనిరుధ్ సెక్స్ చేశారని, సింగర్ చిన్మయి పెళ్లికి ముందే అనేక సార్లు అబార్షన్ చేయించుకుంది... అంటూ సింగర్ సుచిత్ర సుచి లీక్స్ ద్వారా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
మానసిక ఆందోళనతో
కోలీవుడ్ లో పెను కలకలం రేపిన అనంతరం ఆమె అందుబాటులో లేకుండాపోయింది. ఆమె మానసిక ఆందోళనతో బాధపడుతోందని ఆమె భర్త కార్తీక ఆ సమయంలో పలుమార్లు వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె అమెరికాలో ఉందని చెబుతూ భర్త కార్తీక్ ఒక ఫోటోను పోస్టు చేశాడు. అమెరికాలో ఆమె విశ్రాంతి తీసుకుంటోందని, తాను ఒక కామెడీ స్పెషల్ ను రాస్తున్నానని తెలిపాడు.
ఇక్కడికి తిరిగి రాకూడదని
ఇక ఆమె ఇక్కడికి తిరిగి రాకూడదని గట్టి వార్నింగులు వెళ్లాయట. ఆమె కనుక మళ్లీ ఇండియాకి తిరిగి వచ్చినా, లేదా ఎక్కడ వున్నా కానీ మళ్లీ ఆన్లైన్లో కనిపించినా తమ ఫ్యామిలీకి ప్రమాదమని, నామ రూపాలు లేకుండా చేసేస్తామని తీవ్రంగా హెచ్చరించారట. తమిళ చిత్ర పరిశ్రమని శాసించే కుటుంబాలు, వ్యక్తులు కూడా వుండేసరికి పాపం ఈ చిన్ని సింగర్, నటుడి కుటుంబం చివరుటాకులా వణికిపోయిందట.
ఆమే పారిపోవాల్సి వచ్చింది
ఇప్పుడు సుచిత్ర కెరియర్ పూర్తిగా ఖతమవడమే కాకుండా పాపం ఆమె భర్తకి కూడా అవకాశాలు వచ్చేట్టు లేవు. ఒక సామాన్య స్థితిలో ఉన్న ఆమె ఇండస్ట్రీలో ఉన్న వారి ఆగడాలను అడ్డుకోజూస్తే ఏమవుతుందీ, మత్తుమందు తో తనని అబ్యూజ్ చేసినా, బెదిరింపులతో గాయ పరిచినా ఆమె చేయగలిగిందేమీ లేదు. పైగా తప్పంతా తనదే అన్నట్టు ఇప్పుడు ఆమే పారిపోవాల్సి వచ్చింది. కారకులు మాత్రం ఇంకా హాయిగా పెద్ద స్టార్ల పేరుతోనే తిరుగుతున్నారు.