అక్కడ కూడా హాట్ బ్యూటీ దీక్షా సేత్ హల్ చల్...!?
కోలీవుడ్ లో దీక్షాసేథ్ హల్ చల్ చేస్తోంది. వేదం సినిమాతో తెలుగునాట ప్రవేశించిన ఈ పొడుగు కాళ్ల సుందరి ఆ తర్వాత మిరపకాయ్, వాంటెడ్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మరో రెండు భారీ తెలుగు చిత్రాల్లో నటిస్తున్న దీక్షపై అప్పుడే తమిళ చిత్ర పరిశ్రమ దృష్టి పడింది. తెలుగులో కాస్త హాట్ అనిపించిన ఏ హీరోయిన్ ని అయినా వెంటనే అక్కడికి తోలుకుపోయే కోలీవుడ్ వాళ్లు దీక్షని కూడా వలేసి పట్టేశారు.
ఆమధ్య 'వెందాన్" సినిమాలో విక్రమ్ సరసన నటించే చాన్స్ పొందిన దీక్షా, ఇప్పుడు తాజాగా మరో అవకాశం కూడా కొట్టేసింది. శింబు హీరోగా నెల్సన్ డైరెక్షన్ లో రూపొందుతున్న 'వెట్టయ్ మన్నన్" సినిమాలో ప్రధాన కథానాయికగా ఎంపికైంది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందించే ఈ సినిమాలోని కథానాయిక పాత్రకి పలువురు బాలీవుడ్ తారల్ని పరిశీలించిన మీదట చివరికి దీక్షాకే శింబు ఓటేశాడట. ఈ సినిమా షూటింగ్ జూన్ 6న సెట్స్ కు వెళ్లనుందని సమాచారం. అలాగే, మరికొన్ని తమిళ సినిమాలలో కూడా ఆమె బుక్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇందుకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయట. మరో పక్క ఈ ముద్దుగుమ్మ తెలుగులో రెండు సినిమాలలో నటిస్తున్న సంగతి మనకు తెలుసు!


Click it and Unblock the Notifications











