హీరోల్లా పంచ్ లిస్తుంటే మజా..మజాగా ఉంది: ధీక్షా...!
'వేదం", 'మిరపకాయ్", 'వాంటెడ్" చిత్రాల ఫేం ధీక్షా సేథ్, కోలీవుడ్ లోకి అడుగుపెట్టిన మంచి క్రేజ్ దక్కించుకొంది. కోలీవుడ్ విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మాస్ మసాలా ఎంటర్ టైనర్ లో ధీక్షా సేథ్, సెక్సీ సెక్సీ హీరోయిన్ గా తన సత్తా చాటనుందట. సింగనమల రమేష్ బాబు నిర్మిస్తోన్న ఈ సినిమా తెలుగులోనూ విడుదల చేస్తారని వినికిడి. అన్నట్టు అమ్మడికి విక్రమ్ అన్నా, అతని నటన అన్నా భలే ఇష్టమట. 'అపరిచితుడు" సినిమా చూశాక విక్రమ్ కి వీరాభిమానినైపోయాననీ, అతనితో కలిసి నటించే ఛాన్స్ రావడం తన అదృష్టమనీ ఓ రేంజ్ లో విక్రమ్ ని మోసేస్తోంది.
ఈ ముద్దుగుమ్మకి అవకాశం వస్తే కనుక ఫైట్స్ ఇరగదీసేస్తానని చెబుతోంది పొడుగు కాళ్ళ సుందరి దీక్షా సేథ్. నిజజీవితంలో అనుకుంటున్నారేమో... సినేమాల్లోనేలెండి... అలాంటి పాత్రలంటే తనకి ఎంతో ఇష్టమని అంటోంది. 'నేను పైకి చాలా స్మూత్ గా కనిపిస్తాను కానీ, నాకు యాక్షన్ సినిమాలంటే ప్రాణం. 'టాంబ్ రైడర్' లాంటి హాలీవుడ్ సినిమాలంటే మహా ఇష్టం. ప్రస్తుతం ధీక్షాసేథ్ తమిళంలో యమా బిజీగా ఉంది.
ప్రస్తుతం తమిళంలో విక్రమ్ తో కలిసి సుశీంద్రన్ దర్శకత్వంలో 'రాజా పట్టై' అనే సినిమాలో చేస్తున్నాను. ఇది యాక్షన్ సినిమా. ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను. హీరోల్లా పంచ్ లిస్తుంటే మజాగా వుంటుంది. అసలిలాంటి సినిమాలు ఏడాదికి ఒకటి చేయాలని వుంది" అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఎవరైనా ఫుల్ యాక్షన్ సినిమాలో చాన్స్ ఇస్తే తన తడాఖా చూపిస్తానని చాలెంజ్ చేసి మరీ చెబుతోంది. మరి, ఎవరైనా దీక్షాకి ఓ చాన్స్ ఇచ్చి చూడచ్చు!


Click it and Unblock the Notifications











