కమల్ హాసన్ సరసన దీపికా, డిటేల్స్
చెన్నై : కమల్‌హాసన్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణే నటించనుందా? అవుననే అంటున్నాయి తమిళ సినీవర్గాలు. హిందీలో మంచి పేరు సొంతం చేసుకున్న దీపికా సొంత ఊరు బెంగుళూరు. దక్షిణాదిన నటించాలని మొదటి నుంచి ఆసక్తి ప్రదర్శిస్తూ వచ్చింది. 'రాణా'లో రజనీకాంత్ సరసన నటించాల్సి ఉండగా అర్ధాంతరంగా ఆగిపోయింది.
అయితే అదృష్టం ఆమె వెన్నంటే ఉంది. సూపర్‌స్టార్‌తో 'కోచ్చడయాన్'లో అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం కమల్‌తోనూ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వనటుడితో మాస్ దర్శకుడు లింగుస్వామి చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇందులో నాయికగా దీపికాను ఎంపిక చేసినట్లు వినికిడి.
ఇప్పటి వరకు అధికారపూర్వక ప్రకటన లేనప్పటికీ, వారిద్దరిని వెండితెరపై చూపేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. హిందీలో మంచి విజయం సాధించిన 'స్పెషల్ ఛబ్బీస్' చిత్రం తెలుగు,తమిళ రీమేక్ కు కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ప్రముఖ తమిళ దర్సకుడు లింగు స్వామి రైట్స్ తీసుకున్నారు. తమ బ్యానర్ తిరపతి బ్రదర్శ్ పై ఈ చిత్రం రైట్స్ తీసుకున్న లింగు స్వామి,తానే డైరక్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాసం ఉంది. మిగతా పాత్రలు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. మరో ప్రక్క కమల్ విశ్వరూపం 2 ప్రాజెక్టు వేగంగా రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











