లింగుస్వామి డైరెక్షన్ లో మాజీ లవర్స్...?!
'బచ్ నా ఎ హసీనో" చిత్రం తర్వాత గత కొంత కాలంగా రణ్ బీర్ కపూర్ తో కలిసి నటించని దీపికా పదుకునే త్వరలో ఆయనతో జోడీ కట్టబోతోంది. అదీ ఓ రీమేక్ చిత్రంలో . గజినీ సూర్య తమ్ముడు కార్తీ, మిల్క్ బ్యూటీ తమన్నా జంటగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'పయ్యా" తెలుగులో 'ఆవారా"గా అనువాదమై ఇటు తమిళం, అటు తెలుగు భాషల్లో విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. అర్బన్ లవ్ స్టోరీగా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో లింగుస్వామి రూపొందించిన ఈ చిత్రాన్ని ఆయన దర్శకత్వంలోనే రీమేక్ చేయడానికి ఓ బాలీవుడ్ నిర్మాత ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
ఇందులో మాజీ ప్రేమికులైన రణబీర్ కపూర్, దీపికా పదుకునే జంటగా నటించే అవకాశం వుందని తెలుస్తోంది. ప్రస్తుతం తమిళంలో ఆర్య, మాధవన్ కథానాయకులుగా మల్టీస్టారర్ గా రూపుదిద్దుకొంటున్న 'వెట్టె"చిత్రాన్ని లింగుస్వామి ఆ చిత్రం పూర్తయిన తర్వాత హిందీ 'అవారా" పనుల్లో నిమగ్నమవుతాడట. వెట్టె చిత్రం పూర్తి అయ్యి విడుదలయిన తర్వాత ఆవారా రీమేక్ చిత్రం గురించి పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం 'దేశీబాయ్స్" చిత్రంలో నటిస్తున్న దీపిక 'కాక్ టైల్", రజనీకాంత్ తో 'రానా" చిత్రాల్లో నటించనున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











