రజనీకాంత్‌తో దీపిక పదుకోన్.. ఆ క్రేజీ ప్రాజెక్ట్ వివరాలు మీ కోసం..
ఆరోగ్య పరీక్షల కోసం అమెరికా వెళ్లి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినిమా షూటింగులను పూర్తి చేసుకోవడానికి సిద్ధం అవుతూ వరుసగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అన్నాతే షూటింగును ఇటీవల పూర్తి చేసుకొన్న రజనీకాంత్.. త్వరలోనే కోల్‌కతాలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు. ఇలాంటి వార్తల మధ్య రజనీకాంత్ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో మరో సినిమాను అంగీకరించారు. ఈ చిత్రంలో దీపిక పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తుంది అనే వార్త కోలీవుడ్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తున్నది.
గతంలో రజనీకాంత్‌తో కలిసి యానిమేషన్ చిత్రం కొచ్చడయాన్‌లో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రాణా అనే చిత్రంలో నటించాల్సింది. కానీ రజనీకాంత్ ఆరోగ్యం క్షీణించడంతో ఆ సినిమా వాయిదా పడటంతో మరోసారి దీపక జతకట్టలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ చాలా రోజులకు రజనీతో జతకట్టే అవకాశం ఏర్పడింది.

రజనీకాంత్ కెరీర్‌లో 169వ చిత్రాన్ని తలైవర్169 అని వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు యువ దర్శకుడు దేసింగు పెరియాస్వామి డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన సమాచారం అధికారికంగా వెల్లడించే ప్రయత్నం చేస్తున్నారు.
దీపిక పదుకోన్ కెరీర్ విషయానికి వస్తే.. లాక్‌డౌన్‌కు ముందు ఛపాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం కపిల్ దేవ్ బయోపిక్ 83, శకున్ బాత్రా రూపొందించే ఇంకా పేరు పెట్టని చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాకుండా షారుక్ ఖాన్‌తో పఠాన్, రణ్‌వీర్ సింగ్‌తో సర్కస్ చిత్రంలో నటిస్తున్నారు


Click it and Unblock the Notifications











