మణిరత్నం ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నా!

By Srikanya

చెన్నై : మన తెలుగులో మణిరత్నం ఇక్కడ హీరోలుతో సినిమా చేద్దామంటే కుదరలేదు కానీ... మణిరత్నం దర్శకత్వంలో నటించేందుకు చాలా మంది బాలీవుడ్ హీరో,హీరోయిన్స్ ఉత్సాహం చూపుతున్నారు. కాలానికి తగ్గట్టు భిన్నమైన టేకింగ్‌లో, తెరపై వైవిధ్యాన్ని ఆకర్షించే ఈ దర్శకుడికి హాలీవుడ్‌ స్థాయిలోనూ అభిమానులున్నారు. హాలీవుడ్‌లో అవకాశాలు వచ్చినా.. ఇక్కడే ఉండి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆయన చిత్రంలో నటించాలనే అభిప్రాయాన్ని నటి దీపికా పదుకొనే కూడా వెలిబుచ్చింది.

Deepika Padukone Wants To Work With Maniratnam

ఇటీవల చెన్నై వచ్చిన ఈ ముద్దుగుమ్మ మీడియాతో ముచ్చటిస్తూ.. '' 'కోచ్చడయాన్‌'(విక్రమ్ సింహా) లో నటించాక తమిళంలో చాలా సినిమాలు చేయాలనే కోరిక పుట్టింది. ప్రస్తుతం మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా. హీరోతో నిమిత్తం లేదు. కథే ముఖ్యం. నాకు మణిరత్నం సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలన్నీ చూశా. తమిళంలో ఆయన దర్శకత్వంలో నటించాలనుంది. గతంలో ఓ సారి అవకాశం వచ్చినా కొన్ని కారణాల వల్ల కుదరలేదు అని చెప్పుకొచ్చింది.

అలాగే... నేనెప్పుడు చెన్నైకి వచ్చినా.. రజనీకాంత్‌ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య వారి ఇంటికి తీసుకెళ్తారు. ఇక్కడికి వస్తే ఇంటిభోజనం తప్పనిసరి. అంతేకాదు.. చెన్నైలో షూటింగ్‌కు వచ్చినా.. రజనీకాంత్‌ ఇంటి నుంచే భోజనం వస్తుంది''అని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X