మీడియాకి వార్నింగ్ ఇచ్చిన దీక్షాసేధ్
వేదం చిత్రంతో పరిచయమైన దీక్షాసేధ్ ఆ తర్వాత మిరపకాయ చిత్రంతో తనకంటూ ఓ క్రేజ్ ని క్రియేట్ చేసుకోగలిగింది. తమిళంలో సైతం చేస్తున్న ఆమెపై అక్కడ మీడియా తెలుగులో ఓ హీరోతో ప్రేమ అంటూ ప్రచారం చేస్తోంది. ఇది తెలుసుకున్న దీక్షా మీడియా వారిపై మండిపడుతూ మాట్లాడింది. ఆమె మాటల్లోనే...మాది సంప్రదాయ కుటుంబం. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా ఇంట్లోవారు స్వందిస్తారు. వారు ఎమోషన్ అవ్వుతారు. దయచేసి నాపై ఉన్నవి, లేనివి కల్పించుకొని రాయొద్దు..నా కుటుంబం ఎదురుగా నన్ను దోషిగా నిలబెట్టద్దు అంది. అలాగే ...మీడియాలో ఇలాంటి వార్తలు వస్తూంటే వారు భాధ పడటమే కాక నాపై వారికి ఉండే నమ్మకం సైతం పోతుంది అంది.
దానికి మీడియా వారు మీరు తెరపై ఎక్సపోజింగ్ చేస్తూ నటిస్తూంటే వారికేమీ అనిపించదా..భాధపడరా అని ప్రశ్నించారు. దానికామె మీడియాతో ఛాలెంజ్ కు దిగింది. వారితో..నేను ఎప్పుడైనా పరిధికి మించి ఎక్సపోజింగ్ ఏదైనా సినిమాలో చేసాను అని నిరూపించండి అంది. నేనూ ఎప్పుడూ నా లిమిట్స్ లోనే ఉన్నాను..మీరూ లిమిట్స్ లో ఉంటే మంచిది అని తేల్చేసింది.
అలాగే తాను నటిస్తున్న సినిమాల్లోని తన పాత్రల గురించి చెబుతూ..''రవితేజ 'నిప్పు"లోని నా పాత్రలో గ్లామర్ పాళ్లు కాస్త ఎక్కువే. ఇక మంచు మనోజ్ సినిమా 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా"లో అయితే విచిత్రమైన పాత్ర చేస్తున్నాను. కథలో చాలా కీలకమైన పాత్ర అది. తమిళంలో విక్రమ్‌తో చేసిన 'వీడింతే"లో అయితే ఫైటింగ్‌లు కూడా చేశా. ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా వెరైటీ పాత్రలు లభించడం నా అదృష్టం"" అని చెప్పుకొచ్చారు దీక్ష.


Click it and Unblock the Notifications











