twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంజలికి మరో షాక్

    By Srikanya
    |

    సేలం : ఆ మధ్యన హటాత్తుగా అదృశ్యమై సంచలనం క్రియేట్ చేసిన అంజలి ఇంకా ఆ తల నొప్పుల నుంచి బయిటపడలేదు. తాజాగా తమ సంఘ అధ్యక్షుడు కలంజియంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంజలిని విచారించాలని ఆయన అనుచరులు సేలం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు.

    సేలం రెండో జ్యుడీషియల్‌ మేజిస్ట్రేటుకు కలంజియం నడుపుతున్న తమిళ్‌ నల ఇయక్కం సంఘం కార్యకర్త మురుగన్‌ పిటిషన్‌ అందజేశారు. తమిళ అభివృద్ధికి పాటుపడే తమ సంఘ అధ్యక్షుడు కలంజియంపై నటి అంజలి ఆరోపణలు చేయడం ఆవేదన కలిగిస్తోందన్నారు.

    కలంజియం తనను ఏటీఎంలా వాడుకున్నారనే ఆరోపణ సత్యదూరమని ఈ విషయమై నటి అంజలి వద్ద విచారణ జరపాలని కోరారు. విచారణను 13కి వాయిదా వేశారు.

    మరో ప్రక్క కలంజియమ్‌ రూపొందించే 'వూర్‌ సుట్రి పురాణం' అనే చిత్రంలో అంజలి నటించాల్సి ఉంది. అయితే షూటింగ్ కు రావట్లేదని అందుకే దక్షిణ భారత నటీనటుల సంఘంలో ఫిర్యాదు చేస్తానని దర్శకుడు మీడియాకి చెప్పారు.

    కలంజియమ్‌ మాట్లాడుతూ ''నేను తీస్తున్న చిత్రం కథానాయిక ప్రాధాన్యం ఉన్నది. చిత్రీకరణ ప్రారంభమయ్యాక 15 రోజుల పాటు అంజలి నటించింది. కొంత భాగం చిత్రీకరణ మిగిలి ఉంది. ఇది గురువారం మొదలైంది. అయితే అంజలి పాల్గొనలేదు అన్నారు.

    అలాగే అంజలి లేకుండా సినిమా పూర్తవడం అసాధ్యం. అందుకే షూటింగ్ రద్దు చేయాల్సి వచ్చింది. ఫోనులో సంప్రదించేందుకు విఫలయత్నం చేశా. ఈ సినిమా కోసం ఇప్పటికే రూ.40లక్షలు వెచ్చించాం. ఈ విషయమై ఆమెపై నటుల సంఘంలోనూ నిర్మాతల మండలి, దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేయబోతున్నాను అన్నారు.

    English summary
    A Tamil outfit headed by film director Kalanjiyam today filed a defamation case against southern actress Anjali in a court here over her recent remarks accusing him of harassment. In his petition before Judicial Magistrate II, Murugan, Secretary of the local unit of Tamizhar Nalam Periyakkam (movement for Tamils welfare), submitted that Kalanjiyam had been working for the welfare of Tamils and the remarks by the actress had hurt the sentiments of his followers. He sought to punish Anjali for defamation under IPC sections 499 and 500 besides 505 (statements conducing to public mischief).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X