»   » డెఫినెట్ గా వాడు సిక్ పర్సన్...హన్సిక తిట్లు

డెఫినెట్ గా వాడు సిక్ పర్సన్...హన్సిక తిట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాట్ స్టార్ హన్సికకీ, ఆమెతో సినిమా చేస్తున్న దర్శకుడు ప్రభుదేవాకీ మధ్య రిలేషన్ రన్ అవుతోందంటూ రూమర్స్ వస్తున్నాయి. ఈ విషయమై తమిళ మీడియా ఆమెను కదిపితే..ఛ..రబ్బిష్..ఏం మాట్లాడుతున్నారు. ప్రభుదేవా నాకు మెంటర్..మార్గదర్శి. అసలు ఇలా రూమర్స్ ఎలా ప్రారంభమవుతాయో అర్ధం కావటం లేదు. అయితే ఈ రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారో అది మాత్రం చెప్పగలను...అతను గ్యారెంటీగా సిక్ పర్శన్ అంటూ మండిపడింది. ఇక చెన్నై బీచ్ గురించి మాట్లాడుతూ..ఈ బీచ్ లు చాలా ఎక్సైయిట్ మెంట్ కు గురిచేస్తాయి. కానీ రెండు సార్లు మాత్రమే అక్కడకి వెళ్ళగలిగాను. ఇక ఇడ్లీ సాంబార్, వడ, హాట్ కాఫీ నాకు చాలా ఇష్టం. మరి నైట్ క్లబ్ ల గురించి చెప్పండి అంటే..ఏమో నేను రాత్రిళ్ళు ఎనిమిదిన్నరకే నిద్ర పోతాను. కాబట్టి నాకు వాటి గురించి అస్సలు అర్ధం కాదు అంది. ఇక హైదరబాద్ గురించి చెప్పండి అంటే..అది నాకు సెకెండ్ హోమ్ లాంటిది అంది. అయితే హన్సిక..చెన్నైకి పెట్టే బేడా సర్దేసిందని చెప్తున్నారు. ఎందుకంటే తెలుగులో ఒక్క ఆఫరూ కూడా ఆమె గుమ్మం తట్టటం లేదు మరి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu