అతను నా క్లోజ్ ప్రెండ్...డ్రగ్ సప్లయిర్ కాదు: త్రిష
డ్రగ్ స్కాండిల్ లో త్రిష ఉందంటూ ఓ ఫోటో టీవీల్లో పదే పదే చూపారు. ఆ ఫోటోలో ఆమెతో పాటు ఓ ఆఫ్రో అమిరికెన్ వ్యక్తి కూడా ఉన్నారు. న్యూస్ లో నైజేరియన్ వాళ్ళతో త్రిష డ్రగ్స్ తీసుకుంటోందంటూ ఈ ఫోటో చూపటంతో ఆ వ్యక్తి ఏ డ్రగ్ సప్లయిరో, లేక త్రిషకు డ్రగ్స్ అలవాటు చేసి తీసుకునో వ్యక్తో అన్నట్లు ఎక్సపోజ్ అయింది. ఈ విషయమై త్రిష స్పందిస్తూ..ఆ వ్యక్తి నాకు క్లోజ్ ప్రెండ్..అతను ఏ నైజీరియన్ డ్రగ్ డీలరో కాదు...నా డ్రెస్ డిజైనర్ సిడ్నీ సాల్డెన్. ఈ న్యూస్ తెలియకుండా ఇష్టమొచ్చినట్లు ప్రసారం చేసారు. ఈ విషయం తెలిసిన అతను ఎంత హర్ట్ అవుతాడనే సంగతి కూడా మీరు పట్టించుకోలేదు. ఏం నాకు ఆఫ్రో అమెరికన్ ప్రెండ్స్ ఉండకూడాదా...వాళ్ళంతా డ్రగ్ ఎడిక్ట్స్ యేనా అని నిలదీస్తోంది. అలాగే త్వరలోనే ఆ టీవీ చానెల్ వారిని లీగల్ గా కోర్టుకి ఈడ్చి బుద్ది చెప్తాను అని ఛాలెంజ్ చేస్తోంది. ఇక ఫ్యాషన్ రంగంలో టాప్ మోస్ట్ డిజైనర్ గా వెల్గుతున్న సిడ్నీ అంటే చాలా మంది హీరోయిన్స్ కు పిచ్చ అభిమానం. అతని పర్మనెంట్ కష్టమర్స్..త్రిష, రమ్యకృష్ణ, శ్రేయ వంటి స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. వారిలో త్రిష అంటే ఈ మద్యన సిడ్నీ ప్రత్యేక అబిమానం. అతను రెగ్యులర్ గా కండెక్టు చేసే ర్యాంప్ వాక్స్, క్లాక్ ఎగ్జిబీషన్స్ కు త్రిష ప్రత్యేకంగా అటెండవుతుంది.


Click it and Unblock the Notifications











