twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సురక్షితంగా చెన్నై చేరుకున్న కార్తి.... రూ. 1.5 కోట్ల నష్టం!

    |

    తమిళ హీరో కార్తి నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ 'దేవ్' షూటింగ్ కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు మనాలిలో జరుగుతోంది. అయితే ఆదివారం నుండి అక్కడ భారీ వర్షాలు మొదలు కావడంతో షూటింగ్ ఆగిపోయింది. చిత్ర యూనిట్ మొత్తం వరదల్లో చిక్కుకున్నారు.

    పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

    కార్తి, మరికొందరు యూనిట్ ముంబర్స్ అక్కడి నుండి బయల్దేరి చెన్నై చేరుకున్నారు. తమిళనాడు వచ్చిన అనంతరం కార్తి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ తాను మరికొందరితో కలిసి చెన్నై వచ్చానని, దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌తో ఇంకా టీమ్ ముంబర్స్ అక్కడే ఉండిపోయారని, అందరూ క్షేమంగా ఉన్నారని కార్తి తెలిపారు.

    కరెంటు సరఫరా లేక పోవడం, రోడ్డు మార్గం పాడైనందువల్ల వారు రావడానికి కాస్త ఆలస్యం అవుతోందని కార్తి వెల్లడించారు. వరదలు తగ్గిన తర్వాతే అక్కడ మళ్లీ షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని కార్తి వెల్లడించారు.

    'దేవ్' చిత్రానికి రజత్ రవి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కులు మనాలి షూటింగ్ రద్దు కావడం వల్ల నిర్మాతకు రూ. 1.5 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

    ఇంతకు ముందు కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'తీరమ్ అధిగరమ్ ఒండ్రు' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. సౌత్‌లో ది బెస్ట్ పోలీస్ స్టోరీ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

    Dev film cancelled, Karthi back to Chennai last night

    English summary
    Karthi and Rakul Preet Singh’s action thriller ‘Dev’ ran into some unexpected difficulties while shooting in Kulu Manali. The shooting of the Tamil film had to be cancelled due to floods and landslides in Manali. "Few of us came back to Chennai last night. Director, Cameraman and crew are still in Manali but they are safe. Since there is no power and roads are cut off they will come down after a day. Hope rain stops soon!" Karthi tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X