»   » వసంత బాలన్ డైరెక్షన్ లో టాప్ లెస్ గా ధన్సిక...!?

వసంత బాలన్ డైరెక్షన్ లో టాప్ లెస్ గా ధన్సిక...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సహజత్వంతో కూడిన పాత్రలు పోషించే అవకాశం ఆర్టిస్టులకి అరుదుగా వస్తుంది. ఇటీవలి కాలంలో అయితే, ఈ తరహా పాత్రలు అసలు ఎవరికీ రావడం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కథానాయిక ధన్సికకు ఇటువంటి అవకాశం ఓ తమిళ చిత్రంలో వచ్చింది. నేషనల్ అవార్డు విన్నర్ వసంత బాలన్ డైరెక్ట్ చేస్తున్న 'అరవాన్' అనే చిత్రంలో ధన్సిక ఓ నేచురల్ క్యారెక్టర్ పోషిస్తోంది. విశేషమేమిటంటే, ఇందులో తను బ్లౌజ్ (జాకెట్టు) వేసుకోదు. ఈ చిత్రానికి యంగ్ ప్లేబాక్ సింగర్ కొత్త మ్యూజిక్ డైరక్టర్ అయినటువంటి జివి ప్రకాష్ ని పరిచయం చేస్తున్నారు!

300 ఏళ్ల క్రితం నాటి వాతావరణానికి సంబంధించిన కథాంశమిది. ఇందులో బ్లౌజ్ ధరించకుండా నటిస్తున్నాను. ఈ టైం లో నాకిలాంటి పాత్ర దొరకడం అదృష్టమనే చెప్పాలి. నాకిది టర్నింగ్ పాయింట్ అవుతుంది" అంటోంది ధన్సిక. అన్నట్టు, అసలే కాస్త లావుగా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఇందులోని పాత్రకోసం మరింత లావెక్కాల్సి వచ్చిందట. దర్శకుని సలహాపై 5 కిలోల వెయిట్ పెంచిందట! 'చక్కనమ్మ చిక్కినా అందమే' అన్నట్టు, 'అందగత్తె లావెక్కినా అందమే' అనుకోవాలేమో మనం..

English summary
Yes. You read it correctly. Kollywood actress Dhanshika is going to act in a Tamil film ‘Aravan’ without wearing any blouse or top. She has to go topless because the film will be made on a story that takes place some 300 years ago.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X