ధనుష్ లేటెస్ట్ చిత్రం 'మరియాన్' రిజల్ట్
'పూ' చిత్రంలో మంచి అభినయాన్ని ప్రదర్శించిన పార్వతి హీరోయిన్ గా నటించారు. తమిళ చరిత్రలోనే సూడాన్‌లో తెరకెక్కించిన ఘనత ఈ సినిమాకే దక్కింది. రూ.30 కోట్ల వ్యయంతో ఎక్కువరోజుల పాటు రూపొందించిన ఈ సినిమాకు జాతీయ అవార్డు లభిస్తుందని అందరూ అనుకున్నారు. వూహించినట్టుగానే చిత్రంలో ధనుష్ నటన ఆశ్చర్యాన్ని కలిగించింది.
కెమెరా పనితనం, దర్శకత్వపటిమ, పార్వతి అందాలన్నీ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాయి. అన్ని మీడియాలు సినిమా గురించి గొప్పగానే రాశాయి. కానీ థియేటర్‌లో ప్రేక్షకులు అంతంతమాత్రంగానే ఉన్నారు. మీడియా ప్రశంసలు అందుకున్న ఈ సినిమా.. ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించలేకపోతోంది.
తొలిసారిగా హిందీలో అవకాశాన్ని దక్కించుకున్న ధనుష్ ఇటీవలే 'రాన్‌ఝానా'తో ప్రేక్షకుల చెంతకు వచ్చాడు. సినిమా విజయం సాధించటంతో పాటు ధనుష్ అభినయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అమితాబ్ కూడా ధనుష్ నటనను ఆకాశానికెత్తేశాడు. విమర్శకుల ప్రశంసలందుకుంటున్న బాలీవుడ్ చిత్రం రాన్ జానా చిత్రం కలెక్షన్ల వసూళ్లలోనూ దూసుకుపోతోంది. జూన్ 21 తేదిన 1400 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం వారాంతానికి 31.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 35 కోట్ల వ్యయంతో ధనుష్, సోనమ్ కపూర్ జంటగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రాన్ జానా చిత్రం రూపొందింది.


Click it and Unblock the Notifications












