Raayan First Review: ధనుష్ 50వ సినిమా.. రాయన్‌కు సెన్సార్ షాకింగ్ రిపోర్ట్.. అలాంటి సీన్స్‌పై కట్స్ అంటే?
దక్షిణాదిలో అగ్ర సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై విలక్షణ నటుడు ధనుష్ హీరోగా రూపొందిన చిత్రం రాయన్. ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, అపర్ణ బాలమురుగన్, ఎస్‌జే సూర్య, సెల్వరాఘవన్, దుషారా తదితరులు నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 18వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఇక ఈ మూవీ ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాపై సెన్సార్ రిపోర్టు ఏమిటి? ఇంకా విశేషాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే..
రాయన్ సినిమా విషయానికి వస్తే.. ధనుష్ కెరీర్‌లో ఈ చిత్రం 50వ సినిమా. అలాగే స్వయంగా దర్శకత్వం వహించి.. నటించిన రెండో మూవీ. యాక్షన్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా అందుకే ప్రత్యేకంగా మారింది. ఇటీవల రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌కు భారీ క్రేజ్ లభించింది. దాంతో ఆయన అభిమానులు ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

రాయన్ సినిమా కోసం అత్యుత్తమ టెక్నిషియన్స్ కూడా పనిచేశారు. ఈ సినిమాకు మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహ్మన్ సంగీతం అందించారు. ఇటీవల రిలీజైన రెండు పాటలు కూడా సంగీత ప్రియులను విశేషంగా ఆకర్షించాయి. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా ఓం ప్రకాశ్. ఎడిటర్‌గా ప్రసన్న జీకే, ప్రొడక్షన్ డిజైనర్‌గా జాకీ, ఫైట్స్, యాక్షన్ కంపోజర్‌గా పీటర్ హెయిన్స్ వ్యవహరించారు.
చెన్నైలో ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అధికారులు రివ్యూ చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత A సర్టిఫికెట్ అందించారు. అత్యంత ఉద్వేగానికి గురిచేసే యాక్షన్ సీన్లపై కొన్ని కట్స్ చెప్పారు. ఈ సినిమాలో రక్తంలో తడిసి ముద్దైన అవతారంలో ధనుష్ కనిపించడం.. ఆ పాత్రలో ఆయన నటనపై ప్రశంసలు గుప్పించారు.

సమాజంలోని ఓ కీలక పాయింట్‌ను తీసుకొని కథను చెప్పిన విధానం బాగుంది. దర్శకుడిగానే కాకుండా హీరోగా ధనుష్ సెన్సార్ దృష్టిలో ఫుల్ మార్కులు కొట్టేశారు అని సెన్సార్ అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది. అయితే కొన్ని సీన్లపై అభ్యంతరం చేయడం చేశారు. కానీ కథకు అలాంటివి ముఖ్యం కావడంతో వాటిని తొలగించడానికి యూనిట్ నిరాకరించింది. దాంతో ఈ మూవీకి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అనే విషయం తెలిసింది.
రాయన్ సినిమా రన్ టైమ్‌ను 2.25 నిమిషాలు ఫిక్స్ చేశారు. స్టోరీ నేరేషన్‌లో ల్యాగ్ లేకుండా, ఎమోషన్స్ దెబ్బ తినకుండా గట్టిగా జాగ్రత్తలు తీసుకొన్నారు చేశారు. తెలుగులో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్‌పీ గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సిద్దమైంది. ధనుష్‌కు భారీగా పాలోయింగ్ ఉండటం, ఈ సినిమాపై బజ్ క్రియేట్ అవుతుండటంతో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ధనుష్ 50వ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











