న్యూయార్క్ చిత్రోత్సవాలకి తెలుగు ప్లాప్ చిత్రం
ధనుష్, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం 3. ధనుష్ భార్య ఐశ్వర్య తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికై అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. న్యూయార్క్‌లో జరగనున్న భారతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు 3 చిత్రం ఎంపికయ్యింది. ఈ చిత్రం ప్రారంభం నుంచి పలు సంచలనాలకు వివాదాలకు నెలవుగా మారింది. ఈ చిత్రోత్సవాల్లో పాల్గొనడానికి ఐశ్వర్య, ధనుష్ రెడీ అవుతున్నారు.
సినిమా ప్రారంభైన కొత్తల్లోనే ఇందులోని వైదిస్ కొలై వెరిడీ పాట ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే చిత్రం మాత్రం ప్రేక్షకుల్ని నిరాశ పరచింది. ఈ చిత్రం తెలుగు అనువాదపు హక్కులు పొందిన నిర్మాత నట్టికుమార్ 3 చిత్రం తనకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ ఆరోపణలు గుప్పించారు. ఆ డబ్బుని రజనీకాంత్ కలగచేసుకుని రికవరీ చేయాలని ఆయన కోరారు. అయితే రజనీ తనకీ ఈ సినిమాకి సంభందం లేదని అన్నారు. అప్పుడు ఈ చిత్రం నిర్మాతలపై పోలీసులకు ఫిర్యా దు కూడా చేశారు .
ఇలా ఎన్నో వివాదాలు,విశేశాలు తో దర్శకురాలిగా రజనీ కూతురు ఐశ్వర్యకు ఈ చిత్రం నిరాశకలిగించింది. అయిత ఇప్పుడు ఆమె చాలా సంతోషం గా ఉంది. ఈ చిత్రం న్యూయార్క్‌లో జరగనున్న భారతీయ చలన చిత్రోత్సవాలకు ఎంపిక కావడం తనను ఉత్తేజపరిచింని చెప్పిందామె. ఆమె మాట్లాడుతూ న్యూయార్క్ భారతీయ చలన చిత్రోత్సవాలకు 3 చిత్రం ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ వేదికపై తనను సత్కరించనున్నారని ఆమె తెలిపారు. ఈ చిత్రోత్సవాల్లో ఇంతకు ముందు ఆడుగళం, అళగర్ సామియిన్ కుదిరై చిత్రాలు ప్రదర్శింపబడడం గమనార్హం.
త్రీ చిత్రం విషయానికి వస్తే ఇదో సైక్లాజికల్ ధ్రిల్లర్ గా తెరకెక్కింది. ప్రారంభంలో లవ్ స్టోరిగా నడిచిన ఈ చిత్రం ఇంటర్వెల్ దాటిన నుంచి ధ్రిల్లర్ గా మారటాన్ని ప్రేక్షకులు భరించలేకపోయారు. అంతేగాక ఎంతో ఎక్సపెక్ట్ చేసిన వై దిస్ కొలవారి సాంగ్ తెరపై తేలిపోయింది. ఆ పాటకు సినిమాకు ఏదో లింక్ ఉంటుందని,సినిమాకు అది కీలకమైన మలుపు తిప్పేదవుతుందని అనుకుంటే హీరో భాధతో సముద్రపు ఒడ్డున కూర్చుని పాడుకునే పాటగా సాదా సీదాగా తీసేసారు.


Click it and Unblock the Notifications











