'రాన్‌ఝానా'కు అలా ఎంపికయ్యా : ధనుష్
అనంతరం తొలిసారిగా హిందీలో అవకాశాన్ని దక్కించుకున్న ధనుష్ ఇటీవలే 'రాన్‌ఝానా'తో ప్రేక్షకుల చెంతకు వచ్చాడు. సినిమా విజయం సాధించటంతో పాటు ధనుష్ అభినయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అమితాబ్ కూడా ధనుష్ నటనను ఆకాశానికెత్తేశాడు. 'వై దిస్ కొలవెరి...' హిందీలో అడుగుపెట్టేలాచేసిందన్న వార్తల్ని ధనుష్ తోసిపుచ్చారు.
ఆయన మాట్లాడుతూ.. ఆ పాట ప్రాచుర్యం పొందినా నటుడికి నటన చూసే అవకాశాలొస్తాయి. 'ఆడుగళం'కి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందటమే నాకు కలిసొచ్చింది. నా పేరు జాతీయస్థాయిలో వార్తల్లోకెక్కింది. ఆ కారణంగానే 'రాన్‌ఝానా'కు ఎంపికయ్యాయని నమ్ముతున్నాను. హిందీలో తొలి చిత్రం విజయం సాధించటంపై సంతృప్తిగా ఉన్నానని చెప్పాడు.
విమర్శకుల ప్రశంసలందుకుంటున్న బాలీవుడ్ చిత్రం రాన్ జానా చిత్రం కలెక్షన్ల వసూళ్లలోనూ దూసుకుపోతోంది. జూన్ 21 తేదిన 1400 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం వారాంతానికి 31.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 35 కోట్ల వ్యయంతో ధనుష్, సోనమ్ కపూర్ జంటగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రాన్ జానా చిత్రం రూపొందింది. రాన్ జానా చిత్రంపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. రాన్ జనా చిత్రం గురించి సెలబ్రిటీలు గొప్పగా మాట్లాడుకుంటున్నారని.. అమితాబ్ ట్విటర్ లో పోస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications












