తప్పదు కదా :మళ్లీ భార్య దర్శకత్వంలో..
చెన్నై: భార్య డైరక్షన్ లో హీరో గా చేయటం అంటే కొద్దిగా ఇబ్బంది కరమే. అయితే ఆమెను దర్శకురాలిగా లాంచ్ చేయటం కోసం '3' చిత్రం చేసారు ధనుష్. అయితే ఇప్పుడు ఆమె కథ పట్టుకుని డైరక్షన్ చేస్తానని రంగంలోకి దిగింది. తప్పదు కాబట్టి ఇమ్మిడియట్ గా ఒప్పుకున్నాడంటున్నారు తమిళ చిత్ర వాసులు. కథ ఏమిటి...చిత్రంలో తన పాత్ర ఏమిటనే విషయం కూడా కనుక్కోలేదట ధనుష్. నమ్మకమో..లేక ఆమె మీద ప్రేమో అంటున్నారు అభిమానులు. ఏదైమైనా ధనుష్ సతీమణి ఐశ్వర్య ఈ సారైనా హిట్టవాలని కోరుకుందాం.
'3' .... సూపర్‌స్టార్ రజనీకాంత్ గారాలపట్టి ఐశ్వర్యాధనుష్ దర్శకురాలిగా మారిన తొలి చిత్రం. ఈ సినిమా సంగీతపరంగా దేశవ్యాప్తంగా ఒక ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. భార్య ఐశ్వర్య దర్శకత్వంలో హీరోగా నటించిన ధనుష్... ఇప్పుడు మరో చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారట. సినిమా పేరు 'వాయ్ రాజా వాయ్'గా ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న ధనుష్ తిరిగి రాగానే సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. భర్తను ఐశ్వర్య కోరగానే వెంటనే ఒప్పేసుకున్నారట. ఇప్పటివరకు తన పాత్ర ఏంటో కూడా ధనుష్ తెలుసుకోలేదని సమాచారం. ధనుష్ రాగానే పాత్ర గురించి ఐశ్వర్య వివరించి... చిత్రీకరణ చేస్తారని కోలీవుడ్ సమాచారం.
అయితే కొద్ది నెలల క్రితం మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో...ఇదే విషయం ప్రస్తావనకు వస్తే..నేను నా భార్య దర్శకత్వంలో మళ్లీ నటించను..అంతగా కాకపోతే ప్రొడ్యూస్ చేస్తాను అన్నారు. కానీ ఇప్పుడు సీన్ చూస్తుంటే పరిస్ధితుల్లో తేడా వచ్చినట్లుంది. ఎంత హీరో అయినా భార్య మాట కాదనేదేముంది.


Click it and Unblock the Notifications











