Dhanush-Aishwarya Net Worth: ఇద్దరికీ కోట్లలో సంపాదన.. ఎవరికెంతో తెలుసా?
ఎవరూ ఊహించని విధంగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ అలాగే ధనుష్ లు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొద్ది రోజుల ముందు దాకా కలిసి ఉన్న వీరు విడిపోతారని ఎవరూ అనుకోలేదు. కానీ వీరి విడాకుల ప్రకటన షాకింగ్ గా మారింది. ధనుష్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ ఉండగా ఐశ్వర్య కూడా ఒక పక్క వ్యాపారాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. మరి వీరిద్దరి సంపాదన కోట్లలో ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఆ సంపాదన ఎంత? అనే వివరాలు మేము తెలుసుకునే ప్రయత్నం చేశాం. మీకు కూడా ఆ వివరాలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. చూడండి

పెద్దలను ఒప్పించి
తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ధనుష్ మరియు ఐశ్వర్య రజనీకాంత్ జనవరి 17 రాత్రి విడిపోతున్నట్లు ప్రకటించడం ద్వారా వారి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు. ఈ జంట తమ 18 ఏళ్ల బంధానికి ఈ విధంగా ముగింపు పలుకుతారని ఎవరూ ఊహించలేదు. వారిద్దరూ 2004లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి నాటికి ఐశ్వర్య వయసు 23 ఏళ్లు కాగా, ధనుష్ వయసు 21 ఏళ్లు. వారిద్దరూ కొన్నాళ్లపాటు ఒకరినొకరు అర్థం చేసుకుని ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.

సంయుక్త ప్రకటనలో విడాకులు
అయితే అనూహ్యంగా వీరు విడాకులు ప్రకటించారు. ధనుష్ మరియు ఐశ్వర్య విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, "18 సంవత్సరాలు కలిసి, స్నేహితులుగా, మంచి జంటగా, తల్లిదండ్రులుగా శ్రేయోభిలాషులుగా ఉన్నాం.. ఇప్పుడు ఐశ్వర్య మరియు నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము అని ధనుష్ రాసుకొచ్చారు. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి మరియు మా గోప్యతను దృష్టిలో ఉంచుకుని దాన్ని ఎక్కువగా ప్రస్తావించ వద్దని కోరారు.

వెనుదిరిగి చూసుకోలేదు
2002లో సినిమాల్లోకి అడుగుపెట్టిన ధనుష్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ధనుష్ నటుడిగానే కాకుండా ప్రముఖ నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా, గీత రచయితగా, స్క్రీన్ రైటర్ గా మరియు ప్లే బ్యాక్ సింగర్ గా కూడా పని చేశారు. అదే సమయంలో, ఐశ్వర్య దర్శకురాలిగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చురుకుగా ఉంది. ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన '3' సినిమాతో ఆమె దర్శకురాలిగా పరిచయం అయ్యాడు. తమిళ దర్శకుడు కస్తూరి రాజాకు ధనుష్ చిన్న కుమారుడు కాగా, సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఐశ్వర్య పెద్ద కుమార్తె.

కోట్లకు పడగలెత్తి
ఇక ధనుష్ మరియు ఐశ్వర్యల నికర విలువ అదేనండీ ఆస్తుల విలువ కోట్లలో ఉంది. మీడియా నివేదికల ప్రకారం, ఇద్దరి ఉమ్మడి నికర విలువ దాదాపు 200 కోట్లు అని అంటున్నారు. రిపోర్టులు ప్రకారం ఇద్దరూ కలిసి కోట్లకు పడగలెత్తారు. ధనుష్ 2020 సంవత్సరంలో 145 కోట్లు సంపాదించాడు. అదే సమయంలో, గత సంవత్సరం 2021 లో, కూడా ఆయన 160 కోట్ల రూపాయలు సంపాదించాడు.

సినిమాకు ఏడెనిమిది కోట్ల రూపాయలు
మీడియా కథనాల ప్రకారం, ధనుష్ ఒక సినిమాకు ఏడెనిమిది కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. గత ఐదేళ్లలో ధనుష్ నికర విలువ ఒకటి నుంచి రెండు మిలియన్ డాలర్లకు పెరిగింది. సినిమాలతో పాటు, ప్రకటనలు మరియు కొన్ని ఇతర వ్యాపారాల ద్వారా కూడా ధనుష్ సంపాదిస్తాడు. ధనుష్ తన కుటుంబంతో చెన్నైలోని ఒక ఖరీదైన ప్రాంతంలో నివసిస్తున్నారు. ధనుష్ ఇప్పుడు కోట్ల విలువైన బంగ్లాలో ఒంటరిగానే మిగిలిపోనున్నారు. అంతకు ముందు భార్య ఐశ్వర్య, ఇద్దరు కుమారులతో కలిసి ధనుష్ నివసించిన బంగ్లా విలువ రూ.20-25 కోట్లుగా చెబుతున్నారు.

ఐశ్వర్య వృత్తి రీత్యా
ఇదొక్కటే కాదు, ధనుష్‌కి చెందిన అనేక ఇతర ఆస్తులు ఉన్నాయి. మరోవైపు, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య గురించి చెప్పాలంటే, ఆమె కూడా ఏడాది మొత్తంలో కోటి రూపాయలకు పైనే సంపాదిస్తుందట. ఐశ్వర్య వృత్తి రీత్యా సంవత్సరానికి 7 నుండి 35 కోట్లు సంపాదిస్తుంది. ఆమె రెండు సినిమాలకు దర్శకత్వం వహించగా రెండు నిర్మాణ సంస్థలకు డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తోంది. అలా వీరిద్దరి నికర విలువ కలిపి 200 కోట్లకు పైనే.


Click it and Unblock the Notifications











