ధనుష్ మరో బిగ్ బడ్జెట్ ప్లాన్.. మళ్ళీ ఆ దర్శకుడితోనే
కోలీవుడ్ లో స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నప్పటికీ ధనుష్ సినిమాలకు వచ్చే బజ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎలాంటి సినిమాలు చేసినా కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయి. ఆ సినిమా హిట్టయినా ప్లాప్ అయినా కూడా తదుపరి సినిమాలపై ప్రభావం పడకుండా చూసుకుంటాడు. అందుకు కారణం.. అతను ఎంచుకునే కథలే. ఇక దర్శకుల టాలెంట్స్ ను గుర్తించడంలో కూడా ధనుష్ ఆలోచనా విధానం డిఫరెంట్ గా ఉంటుంది.
ఒక దర్శకుడు చెప్పిన పాయింట్ నచ్చితే తక్కువ బడ్జెట్ లో అయినా సరే చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అవసరం అయితే రెమ్యునరేషన్ తీసుకోకుండా కూడా చేస్తానని అంటాడు. సినిమా రిలీజైన తరువాత చూసుకుందాం అంటూ చిన్న నిర్మాతలకు అండగా ఉంటాడు. ఇక ఇటీవల వచ్చిన కర్ణన్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఆ సినిమాను మారి సెల్విరాజ్ డైరెక్ట్ చేశాడ్జ్.

ఈ దర్శకుడికి కర్ణన్ రెండవ సినిమా. ఇక కర్ణన్ హిట్టవ్వగానే ఆ దర్శకుడితో మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ సినిమా కాస్త హై బడ్జెట్ లోనే తెరకెక్కుతోందట. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా డైరెక్ట్ గా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సెల్వరాజ్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు ధనుష్ ట్విట్టర్ ద్వారా అఫీషియల్ గానే క్లారిటీ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











