ధనుష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్.. రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోన్న అసురన్
హీరో ధనుష్.. మాస్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటున్నాడు. రఘువరణ్ బీటెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. తాజాగా అసురన్ అంటూ వచ్చి బాక్సాఫీస్‌పై యుద్దం చేస్తున్నాడు.

తమిళ నాట సెన్సేషన్...
మొదటి ఆట నుంచే అసురన్‌పై ప్రశంసల వర్షం కురిసింది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ధనుష్ నటనను ప్రత్యేకంగా కొనయాడారు. ధనుష్ చేసిన పాత్ర, నటించిన విధానానికి అందరూ ఫిదా అయ్యారు.

టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా...
అసురన్‌పై, ధనుష్ నటనపై ప్రశంసలు కురిపించడంలో టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా కనిపించడం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు.. చిత్రాన్ని వీక్షించి ప్రశంసలజల్లు కురిపించాడు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సైతం అసురన్ చిత్రాన్ని చూసి ధనుష్ నటను పొగిడాడు.

నేషనల్ అవార్డ్..
అసురన్ సినిమాకు , ధనుష్ నటకు జాతీయ అవార్డు రావాలని, వస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మనుసులనే కాదు.. కాసులను కూడా రాబడుతోందని ధనుష్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్...
ధనుష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా అసురన్ నిలిచిపోయింది. 150 కోట్లను కలెక్ట్ చేసి.. ఆ ఫీట్‌ను సాధించిన ధనుష్ మొదటి చిత్రంగా నిలిచింది. దీంతో ధనుష్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. మరి ఇంకా ఈ మూవీ ఎన్ని రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి. అసలే దీపావళికి విజయ్ బిగిల్, కార్తీ ఖైదీ సినిమా రాబోతోంది. మరి ఈ పోటీని తట్టుకుని అసురన్ నిలుస్తుందా లేదా అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











