మహేష్ బాబును, రజనీకాంత్‌ను బీట్ చేసిన ధనుష్
హైదరాబాద్: రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుష్ తన సత్తా చాటుతూ ముందుకు దూసుకెలుతున్నారు. నటన పరంగా ఇప్పటికే ప్రశంసలు అందుకున్న ధనుష్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్లో కూడా నటిస్తూ తన టాలెంట్ నిరూపించుకుంటున్నాడు. దీంతో ఆయనకు అభిమానుల సంఖ్య భారీగా పెరిగిపోయింది.
2010లో సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్లో జాయినైన ధనుష్ తాజాగా 1 మిలియన్ మార్కును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు థాంక్స్ చెప్పారు. ట్విట్టర్ విషయంలో ఆయన తన మామ రజనీకాంత్‌ను, తెలుగు స్టార్ మహేష్ బాబును అధిగమించడం చర్చనీయాంశం అయింది.

సంవత్సరం క్రితం ట్విట్టర్లో జాయినైన రజనీకాంత్‌కు ట్విట్టర్లో 9,29,000పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అదే విధంగా మహేష్ బాబుకు 9,16,000 పైగా ఫాలోవర్స్ ఉన్నారు. హీరోయిన్ సమంతకు 7,65,000 ఫాలోవర్స్ ఉన్నారు. వీరి సంగతి పక్కన పెడితే సిద్ధార్థ, శృతి హాసన్, త్రిష లాంటి వారు ఎప్పుడో 1 మిలియన్ మార్కను అందుకున్నారు.
ప్రస్తుతం ధనుష్...తమిళంలో మూడు సినిమాలు, హిందీలో ఒక సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ధనుష్ హిందీలో చేసిన ‘రంఝానా' చిత్రం మంచి విజయం సాధించడంతో ఇపుడు ‘షమితాబ్' అనే చిత్రంలో అవకాశం దక్కించుకున్నాడు.


Click it and Unblock the Notifications











