యువ హీరో ఆత్మహత్య.. షాక్‌లో సినీ పరిశ్రమ.. కారణం ఏమిటంటే

తమిళ చిత్ర పరిశ్రమలో యువ నటుడు ఆత్మహత్యతో విషాదం చోటుచేసుకొన్నది. తమిళ సూపర్‌స్టార్‌ ధనుష్‌కు సన్నిహితుడు, తన చిత్రంలో నటించిన శ్రీవాస్తవ చంద్రశేఖర్ తన తండ్రికి చెందిన ఫ్లాట్‌లో బుధవారం ఉరి వేసుకొని మరణించడంతో సినీ ప్రముఖులంతా షాక్‌కు గురయ్యారు. శ్రీవాస్తవ్ మరణ వార్త ఆలస్యంగా వెలుగు చేసింది. శ్రీవాస్తవ్ మృతికి కారణాలు ఏమిటంటే...

ధనుష్‌తో కలిసి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో

ధనుష్‌తో కలిసి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో

శ్రీవాస్తవ చంద్రశేఖర్ ఇటీవల కాలంలో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ వర్థమాన నటుడిగా పేరు తెచ్చుకొంటున్నారు. గతంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఇనై నేకి పాయమ్ తోట్ట చిత్రంలో ధనుష్‌తో కలిసి నటించారు. ఆ చిత్రంలో శ్రీవాస్తవ నటనకు మంచి ప్రశంసలు లభించాయి.

 తండ్రి ఫ్లాట్‌లో సూసైడ్

తండ్రి ఫ్లాట్‌లో సూసైడ్

పలు మీడియా రిపోర్టు ప్రకారం.. షూటింగ్ లేకున్నా బుధవారం షూటింగు ఉందని చెప్పి పెరంబూర్‌లోని ఇంట్లోని నుంచి బయటకు వచ్చారు. ఇంటి నుంచి తన తండ్రి వ్యాపారం కోసం ఉపయోగించే ఫ్లాట్‌లోకి వెళ్లి ఉరివేసుకొన్నారు. తలుపులు ఎంతకు తీయకపోవడంతో అనుమానం వచ్చి పగులగొట్టి చూడగా శ్రీవాస్తవ్ విగత జీవిగా కనిపించారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించినట్టు సమాచారం.

 మానసిక సమస్యలతో బాధపడుతూ...

మానసిక సమస్యలతో బాధపడుతూ...

శ్రీవాస్తవ్ సన్నిహితులు, మీడియా కథనాల ప్రకారం.. గత కొద్దికాలంగా ఆయన మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. కొద్ది నెలలుగా చికిత్స తీసుకొంటున్నారు. ఆయన కోలుకొంటున్నారని భావిస్తున్న సమయంలో శ్రీవాస్తవ్ ఇలాంటి దారుణానికి పాల్పడటం సన్నిహితులు, చిత్ర ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతికి పలువురు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఈటీవీలో శ్రీవాస్తవ్ వెబ్ సిరీస్

ఈటీవీలో శ్రీవాస్తవ్ వెబ్ సిరీస్

శ్రీవాస్తవ్ నటించి వల్లమై థరయో వెబ్ సిరీస్‌లో తెలుగులో ఓ చిన్నదానా అనే డిజిటల్ సిరీస్‌గా ఈటీవీ తెలుగులో ప్రసారమైంది. ఈ సిరీస్‌కు కొలంగల్ ఫేమ్ వీ థిరుసెల్వన్ రచించగా.. చిదంబరం మనివన్నన్ దర్వకత్వం వహించారు. వైవాహిక జీవితంలో అసంతృప్తికి గురైన యువతి కథగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X