నిర్మాతను పీడించిన ధనుష్.. ఆడి కారే కావాలంటూ డిమాండ్

సూపర్ స్టార్ అల్లుడిగానే కాకుండా తనకంటూ ప్రత్యేకంగా సపరేట్ ఫాలోయింగ్ ఏర్పర్చుకున్నాడు ధనుష్. తమిళ నాట యంగ్ హీరోల్లో ధనుష్ శైలి ప్రత్యేకం. మాస్ సినిమాలను చేస్తూ.. కేవలం హీరోయిజం వెనకే పాకులాడకుండా.. కథాబలమున్న చిత్రాలను చేస్తూ నటిగా నిరూపించుకున్నాడు. రీసెంట్‌గా అసురన్ అంటూ వచ్చి బాక్సాఫీస్‌పై దాడి చేశాడు.

 రఘువరన్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర..

రఘువరన్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర..

రఘువరన్ బీటెక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ధనుష్.. మళ్లీ ఆస్టాయిలో మెప్పించలేకపోయాడు. ఆపై వరుసగా ప్రతీ సినిమాను తెలుగులో డబ్ చేస్తూ వస్తోన్న ధనుష్.. అసురన్ చిత్రాన్ని మాత్రం మినహాయించాడు. ఈ మూవీ తెలుగులో గనుక విడదలైతే ధనుష్ రేంజ్ మారిపోయేదనే కామెంట్లు వచ్చాయి.

అసురన్‌తో కలెక్షన్ల సునామీ..

అసురన్‌తో కలెక్షన్ల సునామీ..

వెట్రీమారన్ దర్శకత్వంలో వచ్చిన అసురన్ చిత్రం దక్షిణాదిన హాట్ టాపిక్‌గా మారింది. ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. దాదాపు 150కోట్లు కొల్లగొట్టినట్టు టాక్. అసురన్ చిత్రంతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడని విమర్శల ప్రశంసలు అందుకున్నాడు.

ప్రస్తుతం పటాస్‌తో బిజీ..

ప్రస్తుతం పటాస్‌తో బిజీ..

ధనుష్ ప్రస్తుతం.. ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో సత్య జ్యోతి ఫిల్మ్స్ నిర్మిస్తోన్న పటాస్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. స్నేహ ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఈ మూవీ షూటింగ్‌లో ధనుష్ ప్రవర్తించిన తీరుపై ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

నడిచేంత దూరమే అయినా..

నడిచేంత దూరమే అయినా..

పటాస్ మూవీ కోసం ఓ చోటకు వెళ్లామని, అక్కడ ధనుష్‌కు ఓ రూమ్ అరెంజ్ చేశామని ఆ మూవీ యూనిట్‌కు సంబంధించిన ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఆయన రూమ్‌కు షూటింగ్ స్పాట్‌కు నడిచేంత దూరమే ఉంది. కానీ అభిమానుల తాకిడి ఉండటంతో.. ఆయన కోసం ఓ ఇన్నోవా కార్‌ను ఏర్పాటు చేశామని తెలిపాడు.

ఆడి కారే కావాలంటూ డిమాండ్..

ఆడి కారే కావాలంటూ డిమాండ్..

అయితే తనకు మాత్రం ఆడి కారే కావాలని, అది ఉంటేనే వస్తానని పట్టు పట్టాడట. దీంతో చేసేదేమీ లేక.. రోజుకు 20వేల రెంట్‌తో నలభై రోజుల పాటు అతనికి ఆడి కారును తీసుకొచ్చాడని తెలిపాడు. ఇక సదరు వ్యక్తి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
నెటిజన్ల కామెంట్స్..

నెటిజన్ల కామెంట్స్..

దీంతో ధనుష్‌సై నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. స్వయంగా తాను కూడా ఓ నిర్మాత అయి ఉండి ఇలా పీడించడమేంటని కొందరు షాక్ అవుతున్నారు. ఏది ఏమైనా తన రేంజ్ నిరూపించుకోవడానికి నిర్మాతల జేబు గుల్ల చేస్తున్నాడని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X