హాట్ టాపిక్: దేశ ప్రధానితో యంగ్ హీరో
దేశ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆతిథ్యం స్వీకరించడం అనేది చాలా గర్వంగా ఉందని ధనుష్ పేర్కొన్నారు. ఈ ఢిల్లీ ట్రిప్ మధురానుభూతిని ఇచ్చిందని, ప్రధాని షేక్‌హ్యాండ్ ఇస్తూ నైస్ మీట్ యూ అంటూ కొలెవైరిపాటను అభినందించారని చెప్పుకొచ్చాడు. ధనుష్ ఇటీవల రాసి పాడిన వై దిస్ కొలై వెరి డీ పాట అనూహ్య విజయం సాధిం చింది. ఈ పాట ధనుష్‌ను ఏకంగా దేశ ప్రధానే డిన్నర్‌కు ఆహ్వానించే స్థాయికి తీసుకెళ్లింది. ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆహ్వానం మేరకు దేశ రాజధానిలో ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించిన ధనుష్, ఐశ్వర్య దంపతులు తమ మధురానుభూతిని ఈ విధంగా పంచుకున్నారు.
ఈ పాట నేపధ్యంలోకి వస్తే...ఓ సాదాసీదా అబ్బాయి. ప్రేమలో పడ్డాడు. కొన్ని కారణాలవల్ల ప్రేమలో ఓడిపోయాడు. బాధలో ఒక పాట పాడాడు. అదీ తంగ్లీష్ (తమిళ్+ఇంగ్లీష్)లో. 'యో బోయిస్ అయామ్ సింగింగ్ ఎ సాంగ్. సూప్ సాంగ్..ఫ్లాప్ సాంగ్. వై దిస్ కొలావరి డి...... వైట్ స్కిన్ను గరలు. గరలు హార్టు బ్లాకు... ఐసు ఐసు మీటు.. మై ఫ్యూచర్ డార్కు... వై దిస్ కొలావరి డి...''. అలా సాగిపోతుందీ పాట. ఆ ఫ్లాప్ సాంగే ఇవాళ ఖండాలను దాటుకుని కుర్రకారునేగాక, అమితాబ్ వంటి సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంటోంది.
యూ ట్యూబ్, ఫేస్‌బుక్కుల్లో కోలాహలం సృష్టిస్తోంది. ఇక 'వై దిస్ కొలావరి డి' అంటే అర్ధం ఏంటో తెలుసా? 'చంపెయ్యాలన్నంత కసి ఎందుకే!' అని. సరదాగా చేసిన ఒక పాట ప్రధానితో ఆతిధ్యం స్వీకరించటం దాకా వెళ్లిందంటే మామూలు విషయం కాదు కదా.


Click it and Unblock the Notifications











