Dhanush divorce with Aishwarya విడాకుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్.. అసలు కారణాలు ఇవే అంటూ..

తమిళ సినీ హీరో, విలక్షణ నటుడు ధనుష్ విడాకుల వ్యవహారంలో అనేక కథనాలు, పలు కోణాలు మీడియాలో వెలుగు చూస్తున్నాయి. కొద్ది నెలల క్రితం వరకు అన్యోన్యంగా కనిపించిన దంపతులు విడాకులు తీసుకోవడంపై రకరకాల ఊహాగానాలు మీడియాలో స్వైర విహారం చేస్తున్నాయి. ధనుష్ అఫైర్లు, అక్రమ సంబంధాలే అందుకు కారణమని ఓ వాదన వినిపించింది. అయితే తాజాగా తమిళ మీడియాలో కొత్తగా వెలుగు చూస్తున్న ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే?

పిల్లలు పెరిగేంత వరకు రాజీ

పిల్లలు పెరిగేంత వరకు రాజీ

ధనుష్ విడాకుల ప్రకటన మీడియాకు వెల్లడించగానే.. ఆయనకు హీరోలకు ఉన్న అఫైర్లు, అక్రమ సంబంధాలే కారణమని ప్రధానంగా బయటకు వచ్చింది. అయితే గతంలో కొందరు ఆరోపించిన సంఘటనలే ఐశ్వర్య, ధనుష్ మధ్య మనస్పర్ధలు ఏర్పడటానికి దోహదపడ్డాయి. పిల్లలు పెరిగేంత వరకు వాళ్లిద్దరూ కొంత రాజీ పడ్డారు. ఆ విభేదాలు మరింత పెరిగిపోవడంతో ధనుష్, ఐశ్వర్య విడిపోవాలని నిర్ణయం తీసుకొన్నారు అని మీడియా కథనాలు వెలువడ్డాయి.

బాలీవుడ్‌, హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా

బాలీవుడ్‌, హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా

తమిళ నటుడిగా ధనుష్ గుర్తింపు పొందినప్పటికీ.. అప్పుడప్పుడు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. అమితాబ్‌తో ఓ సినిమా, సోనమ్ కపూర్‌తో మరో సినిమాలో నటించిన ప్రశంసలు అందుకొన్నారు. తాజాగా సారా ఆలీఖాన్‌, అక్షయ్ కుమార్‌తో కలిసి అత్రంగీ రే చిత్రంలో నటించారు. ఓటీటీలో రిలీజైన ఈ చిత్రం క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకొన్నది. దీంతో ధనుష్ కేవలం తమిళంకే పరిమితం కాదల్చుకోలేదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఫ్యామిలీకి దూరమైన ధనుష్

ఫ్యామిలీకి దూరమైన ధనుష్


అయితే హిందీ, తెలుగు, ఆంగ్ల చిత్రాల్లో ధనుష్ నటించేందుకు సిద్దమవుతున్నాడు. దాంతో ఆయన ఎక్కువగా ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ ట్రావెలింగ్‌లో ఉంటున్నారు. దీంతో ఫ్యామిలీకి ధనుష్ సమయం కేటాయించలేకపోతున్నాడు. దాంతో ఐశ్వర్యతో ధనుష్ మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడింది. అలా వారి మధ్య విభేదాలు చోటుచేసుకొన్నాయి అని సన్నిహితులు చెప్పుకొచ్చారు.

ధనుష్ ఫ్యామిలీ ఫంక్షన్లకు దూరంగా

ధనుష్ ఫ్యామిలీ ఫంక్షన్లకు దూరంగా

భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకోవడానికి మరో ప్రధాన కారణం అంటూ మీడియా వెల్లడించిన ప్రకారం.. కొద్దికాలంగా ధనుష్ ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్లకు ఐశ్వర్య దూరంగా ఉంటున్నారు. ధనుష్‌కు కుటుంబ వ్యవహారాలను ఐశ్వర్య పట్టించుకోకపోవడం వల్ల వారిద్దరి మధ్య కలతలు చేసుకొన్నాయి. అంతేకాకుండా ధనుష్, రజనీకాంత్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి అని వెల్లడించారు.

తండ్రి రజనీకాంత్‌ కోసమే పూర్తి సమయం

తండ్రి రజనీకాంత్‌ కోసమే పూర్తి సమయం

ఇదిలా ఉండగా, రజనీకాంత్ ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఎక్కువ సమయం ఐశ్వర్య తన తండ్రితో గడుపుతున్నారు. దాంతో ధనుష్‌తోపాటు ఆయన కుటుంబానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ఈ విషయంలో వారి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. తన తండ్రి ఆరోగ్యం గురించి కేర్ తీసుకోవడం వల్ల ధనుష్‌కు దూరమయ్యారు. ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకోవడానికి ఇలాంటి కారణాలే ప్రధానంగా మారాయి అంటూ సన్నిహితులు వెల్లడించినట్టు సమాచారం.

Recommended Video

Reason Behind Amala Paul And Director AL Vijay Seperation
ధనుష్ సినిమా కెరీర్ ఇలా..

ధనుష్ సినిమా కెరీర్ ఇలా..


ధనుష్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. హిందీలో అత్రంగీ రే సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళంలో రూపొందే సార్ అనే చిత్రంలో ధనుష్ నటించనున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమాను కూడా చేయడానికి సిద్దంగా ఉన్నారు. ఇది కాకుండా ఇంకా హాలీవుడ్, తమిళ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X