»   » ధనుష్-త్రిష కాంబినేషన్లో ‘కోడి’

ధనుష్-త్రిష కాంబినేషన్లో ‘కోడి’

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ స్టార్ ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన ‘తంగ మాగన్' మూవీ డిసెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతోంది. ధనుష్ చేతిలో ఇపుడు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రభు సాలమన్ దర్శకత్వంలో వచ్చే సినిమాకు ఇటీవలే తన షూటింగ్ పార్టును కూడా పూర్తి చేసిన ఆయన త్వరలో దురై సెంథిల్ కుమార్ తో చేసే సినిమాపై ఫోకస్ పెట్టాడు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దురై సెంథిల్ కుమార్ తో చేసే సినిమాకు ‘కోడి' అనే టైటిల్ పెట్టిన తెలుస్తోంది. ఈ మూవీ ఈ రోజు అఫీషియల్ గా లాంచ్ అయింది. ఫార్మల్ పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ చివరి వారంలో సెట్స్ పైకి వెళ్లనుంది.

Dhanush ‘Kodi’ Launched

వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీనే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే భారీ వర్షాలు, వరదల కారణంగా సినిమా ప్రారంభం వాయిదా పడింది. పొలిటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష, శామిలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రిష ఈచిత్రంలో నెగెటివ్ క్యారెక్టర్లో కనినిపిస్తుందని తెలుస్తోంది.

ఈ నెల 18న విడుదల కాబోతున్న ‘తంగ మాగన్' సినిమా వివరాల్లోకి వెళితే..వేల్ రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ధనుష్ సరసన సమంత, అమీ జాక్సన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు గానూ నవ మన్మధుడు అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. రీసెంట్ గా డబ్బింగ్ పూర్తి చేసారు. నాగార్జున కెరీర్లో మన్మధుడు సూపర్ హిట్ చిత్రం. ఇదే టైటిల్ తో రాబోతోండంటతో క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

English summary
Now, Dhanush will be focusing on his film with Durai Senthilkumar. Reports suggest that the project titled ‘Kodi’ has been officially launched today. The film was launched by with a formal pooja. The film has a mega budget and it will go on floors in December end.
Please Wait while comments are loading...