'వై దిస్‌ కొలావరి డి'కు కాపి రైట్స్ సమస్య

By Srikanya

కొలావరి డి పాటతో యువతను ఉర్రూతలూగించిన ధనుష్ కి ఇప్పుడు కొత్త తలనొప్పి పట్టుకుంది. ఆ పాట కాపీ రైట్స్ తనకు కావాలంటే, తనుకు కావాలంటూ షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ పోటీ పడుతున్నారు. షారూఖ్ ఖాన్ ఆ పాట హిందీ రైట్స్ కోసం ధనుష్ మామగారైన రజనీకాంత్ ని కలిసారు. అప్పటికే అక్షయ్ కుమార్ ఆయన్ని కలిసి మాట్లాడి వెళ్లారు. దాంతో రజనీకాంత్ తనకీ తలనొప్పి ఎందుకుని వెళ్లి తన అల్లుడు ని అడగమని, తను ఆ పాటలో కానీ, ఆ పాటలో కానీ ఇన్వాల్స్ కావటంలేదని తేల్చి చెప్పేసాడు. దాంతో ధనుష్ పరిస్దితి ఇప్పుడు వీళ్లద్దరిలో ఎవరికి ఇవ్వాలి అనేది డైలమోలో పడింది. మరో ప్రక్క సౌత్ ఇండియన్ సినిమాలను, పాటలను కంటిన్యూ రీమేక్ చేయటమే జీవితాశయంగా పెట్టుకున్న సల్మాన్ ఖాన్ కూడా ఈ పోటీలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ధనుష్ ఇప్పుడు తన పాట త్రీ సినిమాలోది కాబట్టి దానిని ఎవరైతే రైట్స్ తీసుకుంటారో వారికే ఆ పాట రైట్స్ చెందుతాయని, విడిగా ఆ పాట రైట్స్ ఇవ్వనని తేల్చి చెప్పినట్లు సమాచారం.

అయితే ఇద్దరు స్దార్స్ మాత్రం ఎవరో ఒకరు ఆ పాటను సొంతం చేసుకోవాలని పట్టుదలతో తిరుగుతున్నారు. ఇక పాట నేపధ్యంలోకి వస్తే...ఓ సాదాసీదా అబ్బాయి. ప్రేమలో పడ్డాడు. కొన్ని కారణాలవల్ల ప్రేమలో ఓడిపోయాడు. బాధలో ఒక పాట పాడాడు. అదీ తంగ్లీష్‌ (తమిళ్‌+ఇంగ్లీష్‌)లో. 'యో బోయిస్‌ అయామ్‌ సింగింగ్‌ ఎ సాంగ్‌. సూప్‌ సాంగ్‌..ఫ్లాప్‌ సాంగ్‌. వై దిస్‌ కొలావరి డి...... వైట్‌ స్కిన్ను గరలు. గరలు హార్టు బ్లాకు... ఐసు ఐసు మీటు.. మై ఫ్యూచర్‌ డార్కు... వై దిస్‌ కొలావరి డి...''. అలా సాగిపోతుందీ పాట. ఆ ఫ్లాప్‌ సాంగే ఇవాళ ఖండాలను దాటుకుని కుర్రకారునేగాక, అమితాబ్‌ వంటి సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంటోంది. యూ ట్యూబ్‌, ఫేస్‌బుక్కుల్లో కోలాహలం సృష్టిస్తోంది. ఇక 'వై దిస్‌ కొలావరి డి' అంటే అర్ధం ఏంటో తెలుసా? 'చంపెయ్యాలన్నంత కసి ఎందుకే!' అని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X