ఐశ్వర్య రజనీకాంత్‌తో హీరో ధనుష్ ప్రేమలో ఎలా పడ్డారంటే.. పెళ్లి వెనుక సీక్రెట్ ఇదే!
తమిళ సినీ పరిశ్రమలోనే కాకుండా దక్షిణాదితోపాటు హిందీలో కూడా అద్భుతమైన నటనా ప్రతిభను చాటిన హీరో ధనుష్. ఇటీవల ఆయన నటించిన అసురన్ బ్రహ్మండమైన విజయాన్ని అందుకొన్నది. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకొన్న ధనుష్ ఆ మధ్య తన హిందీ చిత్రానికి సంబంధించి కామెడీ నైట్స్ కపిల్ షోలో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా తన రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో ప్రేమ, పెళ్లి వెనుక కథను వివరించారు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి కారణమేమిటంటే..

రజనీకాంత్ గురించి ధనుష్
కామెడీ షోలో రజనీకాంత్ గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. రజనీకాంత్ ఏదైనా, ఎలాంటి పనినైనా చేయగల సమర్ధుడు. అలాంటి వ్యక్తికి చేయడానికి సాధ్యం కాని పని ఏదైనా ఉందా? సాధారణంగా బయటి ప్రపంచంలో ఎలా ఉంటారు అనే ప్రశ్నకు ధనుష్ సమాధానమిస్తూ.. ఆయన అందరితీ చాలా స్నేహ పూర్వకంగా ఉంటారు. చాలా అందర్ని ఉల్లాస పరిస్తూ కలివిడిగా ఉంటారు. ఆయనకు సాధ్యం కాని పని అంటూ ఏదీ లేదు అని ధనుష్ చెప్పారు.

యాక్టింగ్ గురించే ఆలోచన
ఇక రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో పరిచయం గురించి చెబుతూ నటుడిగా నాకు తొలి రోజులు అవి. యాక్టింగ్, కెరీర్‌పైనే పూర్తిగా దృష్టిపెట్టాను. ఆ సమయంలోనే ఐశ్యర్యతో పరిచయం జరిగింది. అయితే తొలుత తాను పెద్దగా పట్టించుకోలేదు. నా ప్రయత్నాలన్నీ కెరీర్‌పై ఉండటంతో లవ్ మ్యాటర్ గురించి ఆలోచించలేదు అని ధనుష్ అన్నారు.

రెండో సినిమాకు ఐశ్వర్య రజనీకాంత్
ఇక తన రెండో సినిమా కాదల్ కొండై సినిమా మార్నింగ్ చూడటానికి ఐశ్వర్య వచ్చింది. ఆ సమయంలో మరోసారి కలుసుకొన్నాం. సినిమా చూసిన తర్వాత మీ నటన బాగుందని ప్రశంసించారు. అలా కాసేపు మాట్లాడుకొన్న తర్వాత మేము వెళ్లిపోయేటప్పుడు ఐశ్వర్య నాతో కీప్ ఇన్ టచ్ (Keep In touch) అన్నారు. ఆ పదం మా ఇద్దరిని మరింత దగ్గరికి చేర్చింది అని ధనుష్ వెల్లడించారు.

ఐశ్వర్య చెప్పిన ఆ మాటతో
అలా ఐశ్వర్య చెప్పిన కీప్ ఇన్ టచ్ మాటతో మా ఇద్దరి మధ్య పరిచయం ప్రేమ మరింత బలంగా మారింది. ఆ ప్రేమ మరింత ముదిరి పెళ్లి వరకు దారి తీసింది. ఇరు కుటుంబాలకు మా పెళ్లి విషయం చెప్పడం, వారు పెళ్లికి అంగీకరించడంతో ఎలాంటి సమస్య రాలేదు. అలా మిమిద్దరం ఒకటయ్యాం అని ధనుస్ అన్నారు. నా కెరీర్‌లో ఐశ్వర్య పాత్ర కీలకమైంది. ఆమె సహకారం నన్ను మరింత ముందుకు తీసుకెళ్లేలా చేసింది అని ధనుష్ పేర్కొన్నారు.
Recommended Video

ధనుష్ కెరీర్
2002లో థుల్లువాదో లామై చిత్రంతో ప్రారంభమైన ధనుష్ కెరీర్ అంచెలంచెలుగా ఎదుగుతూ పీక్ స్టేజ్‌కు చేరుకొన్నది. కాదల్ కొండై, తిరుడా తిరుడి చిత్రాలు నటుడిగా స్థిరపడేలా చేశాయి. ఇటీవల కాలంలో పా పాండి, విఐపీ, అసురన్, వడ చెన్నై చిత్రాలు నటుడి మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. రాంజ్నా, షమితాబ్ లాంటి చిత్రాలతో హిందీ ప్రేక్షకులను కూడా మెప్పించాడు.


Click it and Unblock the Notifications











