మళ్లీ కలిసిన ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్.. విడాకుల తర్వాత తొలిసారిగా ఇలా

దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు స్టార్ హీరో ధనుష్. ఆయన ఎంచుకునే కథలు, సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. సోషల్ ఎలిమెంట్స్ తో పాటు యూత్ ను అట్రాక్ట్ చేసే అంశాలను కూడా తన సినిమాల్లో ఉండేలా చూసుకుంటూ ప్రస్తుతం నెంబర్ వన్ హీరోగా ఎదిగారు ధనుష్. అయితే తాజాగా ధనుష్ తన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ ను కలవడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గ్గా మారింది. వారు కలిసిన సందర్భంగా సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ వారు ఎందుకు కలిశారనే వివరాల్లోకి వెళితే..

ఐశ్వర్య రజనీకాంత్ తో విడాకులు..
కోలీవుడ్ లో ఆదర్శ దంపతులుగా ఉన్న ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ గతేడాది షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ను ధనుష్ 2004 నవంబర్ 18న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు యాత్ర రాజా, మరొకరు లింగా. 2006లో యాత్ర రాజా జన్మించాడు. 2010లో లింగరాజా జన్మించాడు. వీరిద్దరూ ప్రస్తుతం తమ స్కూలింగ్ ను పూర్తి చేసుకుంటున్నారు. ఇలా హ్యాపీగా సాగిపోతున్న వీరి జీవితానికి 20 ఏళ్లకు బ్రేక్ పడింది. 2024 నవంబర్ 27న విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. కానీ వీరిద్దరు ఎందుకు విడిపోయారనేది ఎవ్వరికీ తెలియదు.

డివోర్స్ తర్వాత తొలిసారిగా ఇలా..
ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు తీసుకున్న తర్వాత తొలిసారిగా ఇప్పుడు కలిశారు. అది కూడా తమ కొడుకు యాత్రా రాజా చదువుకుంటున్న స్కూల్ గ్రాడ్యూయేషన్ వేడుకకు జంటగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ కొడుకు యాత్రా రాజాను కలిసి దగ్గరికి తీసుకున్నారు. ఇద్దరు తమ కొడుకు నవ్వుతూ కనిపించారు. ఇక తల్లిదండ్రులు కనిపించడంతో యాత్ర రాజా వారిద్దరిని చేరో చేతిలోకి తీసుకొని ప్రేమగా మాట్లాడసాగాడు.

మళ్లీ ధనుష్, ఐశ్వర్య కలుస్తారా?
ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ మళ్లీ కలుస్తారా? అని అభిమానులు ఖుషి అవుతున్నారు. అయితే ఇందుకు ఒక రీజన్ కూడా ఉంది. ధనుష్ తన కొడుకుతో పాటు మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ ఉన్న ఫొటోలను, తల్లిదండ్రులు, కొడుకుతో సంతోషంగా ఉన్న ఫొటోలను తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ లో పంచుకోవడంతో ఈ సందేహాలకు ఊపిరి పోసింది. ఏదేమైనా ఇప్పటికీ ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ కలిసిపోతే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ధనుష్ కుబేరా సినిమా వివరాలు..

ధనుష్ తెలుగులో డైరెక్ట్ చేస్తున్న రెండో సినిమా కుబేరా. అంతకు ముందు 'సార్' అనే చిత్రంతో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ ఖమ్ముల దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రమిది. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్. నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X