కొలవెరి మూవీ ‘3’ తెలుగు విడుదల విశేషాలు
వైదిస్ కొలవెరి...అంటూ రజనీకాంత్ అల్లుడు ధనుష్ పాడిన పాట ఎంత పాపులర్ అయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. భారత దేశం ఎల్లలు దాటి ఇతర దేశాల్లో కొలెవెరి ఫీవర్ పట్టుకుంది కాబట్టే ప్రపంచ ప్రసిద్ధ పాటగా యూట్యూబ్ గోల్డెన్ లిస్టులో స్థానం దక్కించుకుంది. ధనుష్-శృతి హాసన్ జంటగా రజనీ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో '3' చిత్రంలోనిది ఈ పాట. మార్చి 30న విడుదలకు సిద్ధం అవుతున్న చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీలోనూ ఒకసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొలవెరి పాట బాగా పాపులర్ అయిన నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ నెలలోనే తెలుగు వెర్షన్ '3'సినిమా మ్యూజిక్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తొలి సినిమా విడుదల కాక ముందే దర్శకురాలిగా ఆమె పేరు మార్మోగి పోతోంది. ఇందంతా కొలవెరి పాట మహత్యమే. ఇక సినిమా హిట్టయితే ఐశ్వర్య రేంజ్ ఎలా ఉంటుందో చెప్పలేం. తన భార్య దర్శకత్వంలో చేయబోయే చివరి సినిమా అని ధనుష్ ఇప్పటికే ప్రకటించాడు. ఆమె తన సినిమాలకే పరిమితం కాకుండా ఇతర హీరోలతోనూ పని చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశాడు.


Click it and Unblock the Notifications











