నయన్ vs ధనుష్ కాంట్రవర్సీ .. క్రేజీ ట్విస్ట్ లు, ఝలక్ లు..
జనరల్ గా ఈగో వార్స్ లాంటివి సినిమాల్లో చూసినపుడు చాలా రసవత్తరంగా అనిపిస్తాయి. అదే అది మగ ఆడవారి నడుమ అంటే ఆ ఎంటెర్టైన్మెంట్ ఇంకో లెవెల్లో ఉంటుంది. అయితే ఇలాంటివి బిగ్ స్క్రీన్స్ పైనే కనిపిస్తాయి కానీ నిజ జీవితంలో మాత్రం తక్కువ చాలా అరుదుగా కనిపిస్తాయి అని చెప్పాలి. కాగా ఇపుడు నిజ జీవితంలో ఓ స్టార్ హీరో అండ్ హీరోయిన్ నడుమ జరుగుతున్న వార్ ఊహించని లెవెల్లోకి మారింది.
తమిళ్ సహా సౌత్ సినిమా దగ్గర క్వీన్ గా పిలవబడే నయనతార తన పెళ్లి వేడుక బాష్ ని పాపులర్ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ కి అమ్మిన సంగతి తెలిసిందే. దీనిని ఒక డాక్యమెంట్రీలా నెట్ ఫ్లిక్స్ తీసుకొస్తున్న తరుణంలో స్టార్ అండ్ వెర్సటైల్ హీరో ధనుష్ ఊహించని షాక్ ని నయనతార, తన భర్త తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ కి అందించాడు. తన సెకండ్స్ క్లిప్ ని నా అనుమతి లేకుండా ఎలా పెడతారు అంటూ ఏకంగా తనకి 10 కోట్లు కట్టాలని నోటీసులు పంపాడు.

అయితే దీనికి కౌంటర్ గా నయనతార పెద్ద ప్రెస్ నోట్ ని కూడా విడుదల చేయడంతో ఇద్దరి నడుమ కాంట్రవర్సీ ఓ రేంజ్ లో చెలరేగింది. అయితే ఇంట్రెస్టింగ్ గా ముందు విమెన్ కార్డ్ తో మొదట నయనతారకే చాలా మంది సపోర్ట్ చేస్తూ మాట్లాడ్డం స్టార్ట్ చేసారు. కానీ నెమ్మదిగా మంచి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ లు , ఝలక్ లు వీరి కాంట్రవర్సీలో మొదలయ్యాయి.
కాగా వీరిలో ఇపుడు ధనుష్ వైపు పాజిటివిటీ బాగా పెరుగుతూ వస్తుండడం గమనార్హం. కాగా ధనుష్ పై నయన్ చేసిన సింపతి డ్రామాని ఇపుడు చాలా కారణాలతో ఫ్యాన్స్ సహా ఇతర తమిళ నెటిజన్స్ కూడా ఎక్స్ పోజ్ చేస్తున్నారు. నయన్ దంపతులకి ధనుష్ సినిమా బిట్ చిన్నదే కావచ్చు కానీ అది తన నిర్మాణం , తన సొంతం . అలాంటప్పుడు తన అనుమతి లేకుండా పెట్టడం అనేది ఖచ్చితంగా అక్రమమే అవుతుంది.

ధనుష్ అంత అడిగాడు అని అంటున్నారు. మరి నయనతార ఏమన్నా తన పెళ్లి డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చిందా అని ప్రశ్నలు వస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ కి ఏకంగా 30 కోట్లో ఎంతో ఛార్జ్ వేసే అమ్ముకున్నారు. ఏం ధనుష్ కి క్లాస్ లు చెప్పే బదులు వారి కంటెంట్ కూడా ఫ్రీగా ఇవ్వాల్సింది కదా . మీరు చేస్తే వ్యాపారం ధనుష్ ఉన్నదే అడిగి విలన్ అయ్యాడా అంటూ నయన్ పై పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
అలాగే నయన్ ఏమీ తక్కువది కాదు. తాను వర్క్ చేసిన ఎన్నో సినిమాలకి ప్రమోషన్స్ కి కానీ, ఈవెంట్స్ కి కానీ వచ్చేది కాదు. ఆమె వల్ల పలువురు నిర్మాతలు చాలా నష్టాలు కూడా ఎదుర్కొన్నారు అంటూ షాకింగ్ చరిత్ర అంతా ఒక్కొక్కటి బయటకి వస్తోంది. అలాగే ఓ అసిస్టెంట్ దర్శకుడు కూడా నయన్ తన పర్సనల్ ట్రిప్స్ కి సినిమాలు చేస్తున్న టైంలో వెళ్లిపోయేది అని బయటపెట్టాడు. ఆ సమయంలోనూ చాలా ఇబ్బంది పెట్టేది అంటూ నయనతార గురించి ఊహించని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనితో ఇపుడు సౌత్ సినీ వర్గాల్లో ఓ రేంజ్ లో మంచి ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











