twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో ధనుష్ మీద మరో కేసు పెట్టారు, ఏం జరిగిందంటే...

    ధనుష్ మీద కదిరేసన్ దంపతులు మరో కేసు పెట్టారు. ధనుష్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో అతని సంతకం నకిలీదని పేర్కొంటూ కేసు వేశారు. అంతే కాకుండా అతని సంతకం నకలును తమకు అందజేయాలని వారు కోర్టును కోరారు.

    By Bojja Kumar
    |

    చెన్నై: తమి హీరో, రజనీకాంత్ అల్లుడు... ధనుష్ తన కుమారుడే అంటూ ఓ ఇద్దరు వృద్ధ దంపతులు కోర్టు కెక్కిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని మేలూరు కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోంది. అయితే ధనుష్ మాత్రం ఆ దంపతులు చెప్పే దాంట్లో నిజం లేదని వాదిస్తున్నాడు.

    మేలూరు తాలూకాలోని మనంపట్టి గ్రామానికి చెందిన ఆర్. కథిరేసన్(60), కె. మీనాక్షి(55) ధనుష్ తమ కొడుకే అంటూ కోర్టు కెక్కారు. తమకు ధనుష్ నవంబర్ 7, 1985లో జన్మించాడని, అసలు పేరు కాలిసెల్వన్ అని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కొన్ని రోజులుగా ధనుష్, ఆ దంపతుల మధ్య వాదప్రతివాదాలు జరుగుతున్నాయి.

    ధనుష్ మీద మరో కేసు పెట్టిన దంపతులు

    ధనుష్ మీద మరో కేసు పెట్టిన దంపతులు

    కాగా... ధనుష్ మీద కదిరేసన్ దంపతులు మరో కేసు పెట్టారు. ధనుష్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో అతని సంతకం నకిలీదని పేర్కొంటూ కేసు వేశారు. అంతే కాకుండా అతని సంతకం నకలును తమకు అందజేయాలని వారు కోర్టును కోరారు.

    ఇప్పటికే పుట్టు మచ్చల షాక్

    ఇప్పటికే పుట్టు మచ్చల షాక్

    కథిరేసన్ దంపతులు కోరినట్లు ధనుష్ పుట్టు మచ్చలను వైద్యులు పరిశీలించి నివేదిక సమర్పించారు. లేజర్ టెక్నాలజీ ద్వారా ధనుష్ తన ఒంటిపై ఉన్న పుట్టు మచ్చలను చెరిపేసుకున్నాడని తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికతో ధనుష్ ఈ కేసులో మరింత ఇబ్బందుల్లో పడ్డట్లయింది. ఈ కేసు ఏప్రిల్‌ 11న విచారణకు రానుంది.

    తమ కొడుకే అంటూ బలంగా

    తమ కొడుకే అంటూ బలంగా

    తానొక రిటైర్డ్ బస్ కండక్టర్ అని, తన కుమారుడు 10వ తరగతి వరకు మేలూరులోని ఆర్ సి మిడిల్ స్కూల్ మరియు ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యనభ్యసించాడని, తర్వాత 2002లో అతన్ని 11వ క్లాసు చదువకోసం శివగంగ జిల్లా తిరుపథూర్ లోని అరుముగమ్ పిల్లై సతాయ్యామ్మాల్ హెచ్ఎస్ఎస్ లో చేర్పించామని.... అక్కడ చేర్పించిన నెలరోజుల్లోనే స్కూలు విడిచి పారిపోయాడని, అక్కడి నుండి పారిపోయిన తర్వాత చెన్నై వెళ్లాడు... సినిమా రంగంలో కెరీర్ ప్రారంభించాడు. తన పేరు కూడా థనుష్ కె రాజాగా మార్చుకున్నాడు అంటూ కదిరేశన్ దంపతులు వాదిస్తున్న సంగతి తెలిసిందే.

     వారి పరిస్థితి బాగోలేకే

    వారి పరిస్థితి బాగోలేకే

    మా పరిస్థితి ఇపుడు దయనీయంగా ఉంది. మా కుమారుడు నుండి తమకు నెలకు రూ. 65000 మెయింటనెన్స్ వచ్చేలా చూడాలని ఆ దంపతులు కొన్ని రోజులుగా న్యాయ పోరాటం చేస్తున్నారు.

    English summary
    The case filed by an elderly couple claiming that actor Dhanush is their biological son. The court has recently conducted medical examination to verify the identification marks which was mentioned in the school transfer certificate. Now the couple has filed yet another petition claiming that Dhanush's signature in the vakalat was forged.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X