»   » 'వీడు హీరోనా..' అని ఎగతాళి చేసారు

'వీడు హీరోనా..' అని ఎగతాళి చేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై : ''నేను పరిశ్రమలో అడుగుపెట్టేటప్పుడు 'వీడు హీరోనా..' అని అంతా ఎగతాళి చేసారు. హిందీలోనూ అలాంటి మాటలే విన్నాను. అక్కడ కూడా నా సినిమా వూహించని స్థాయిలో విజయవంతమైంది. తప్పకుండా హాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తా. అప్పుడూ ఇలాంటి మాటలు వినిపించొచ్చు. వాటిని నేను పట్టించుకోను. నేను నటించగలననే నమ్మకం ఉంది. దాంతోనే విజయాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను''అని ధనుష్ చెప్పాడు. ఆయన తనకు హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్న విషయం మీడియా ప్రస్తావిస్తే ఇలా స్పందించారు.

ఇటీవల హాలీవుడ్‌లో నటించే అవకాశాలు వచ్చాయట ధనుష్‌కి. ప్రస్తుతం నటించలేనని చెప్పాడట. దీని గురించి ఆయన ముచ్చటిస్తూ.. ''హాలీవుడ్‌లో పలు అవకాశాలు వస్తున్నాయి. కథలను కూడా పంపుతున్నారు. ఇప్పట్లో కుదరదని చెప్పాను. పలు సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నా. అయితే త్వరలో తప్పకుండా హాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తా. నేను నటించగలననే నమ్మకం ఉంది. దాంతోనే సక్సెస్ ని సాథిస్తా''అని చెప్పాడు.

ఇక 'కొలవెరి..' పాటతో యువహీరో ధనుష్‌ స్టార్‌డం తారాస్థాయికి చేరుకుంది. హిందీ చిత్రసీమ ఎర్రతివాచీ పరిచింది. 'రాంజనా'తో బాలీవుడ్‌లోనూ విజయపతాకం ఎగురవేశాడు ధనుష్‌. దీంతో వరుసగా అక్కడ అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో ఇటీవల వచ్చిన 'నయ్యాండి' ఆశించిన స్థాయిలో పేరు తెచ్చిపెట్టలేదు. ప్రస్తుతం 'వేలయిల్లా పట్టదారి', 'అనేగన్‌'లో నటిస్తున్నాడు.

English summary
Dhanush says that he had denied 3 foreign movie offers due to hectic schedule in India.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu