బడా స్టార్స్ కూతుర్లే హీరో ధనుష్ టార్గెట్టా?
చెన్నై: తమిళ హీరో ధనుష్. చూడటానికి బక్కపలుచగా ఉంటాడు. పెద్దగా ఆకట్టుకునే రూపం కూడా కాదు. కానీ తనలో చాలా టాలెంటు ఉందని నిరూపించుకున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సినిమా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్లో అడుగు పెట్టి తొలి సినిమా(రంఝానా) హిందీ స్టార్ హీరో అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్‌తో చేసాడు.

చూడటానికి ఇవన్నీ కో ఇన్సిడెంట్ అనిపించినా.....ధనుష్ కావాలనే బడా స్టార్ల కూతుర్లను ఎంపిక చేసుకుంటున్నాడా? అనే అనుమానం రాక తప్పదు. తాజాగా ధనుష్ మరో స్టార్ కూతురుతో సినిమా చేయబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ దర్శకుడు మహేష్ భట్ కూతురు అలియా భట్‌తో కలిసి ధనుష్ నటించబోతున్నాడు.
ఆ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే....తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో చిత్రంలో ధనుష్‌కు జోడీగా అలియా భట్ నటించబోతోంది. సినిమా స్టోరీలైన్ బాగా నచ్చడంతో అలియా భట్ ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అలియా భట్‌కు ఇదే తొలి తమిళ సినిమా.


Click it and Unblock the Notifications











