ధనుష్ ‘అసురన్’ మూవీ ఫస్ట్ లుక్
ధనుష్ హీరోగా రూపొందుతున్న 'అసురన్' మూవీ ఫస్ట్ లుక్ రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేశారు. ఇంతకు ముందు ధనుష్ హీరోగా వడ చెన్నై చిత్రాన్ని రూపొందించిన వెట్రి మారన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
'వడ చెన్నై' విజయం తర్వాత ధనుష్- వెట్రిమారన్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా సినిమా స్టోరీకి సంబంధించిన ఎలాంటి క్లూ ఇవ్వక పోవడం గమనార్హం.

జనవరి 26 నుంచి 'అసురన్' షూటింగ్ మొదలు కాబోతోంది. మలయాళం నటి మంజు వారియర్ ఈ చిత్రంలో ధనుష్‌కు జోడీగా లీడ్ రోల్ చేస్తోంది. ఈ మూవీ తమిళ నవల వెట్కాయ్ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం.
ఈ చిత్రం ద్వారా జీవి ప్రకాష్, ధనుష్, వెట్రీ మారన్ మరోసారి కలిసి పని చేస్తున్నారు. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ సంవత్సరాంతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











