కోటి దాటిన ‘కోలవెర డి’ పాటకు పవన్ కళ్యాణ్ డాన్స్ రీమిక్స్..!?
సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొత్తగా కూనిరాగం తీసినా ఇప్పుడు సంచలనం అయిపోతోంది. ఇప్పటి వరకు ఏ చిత్రంలోనూ పాట పాడటానికి సాహసించని తమిళ హీరో ధనుష్ చేత అతని భార్య, రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ ఓ పాట పాడించి పెద్ద ప్రయోగమే చేసింది. ఆమె దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం '3". ఈ చిత్రం కోసం ధనుష్ ' వై దిస్ కొల కొల డి" అనే పాట పడటమే కాకుండా తనే రచన చేశాడు.
ఈ పాట పేరుకు తగ్గట్టే ప్రపంచ వ్యాప్తంగా వేలం వెర్రిగా మారిపోయి యువ హృదయాలని ఉర్రూతలూగిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చిన ఈ పాట తమిళ, ఇంగ్లీష్ పదాల కలబోతతో కొత్త పంథాలో సాగిపోతుంది. ఈ పాటని ఈ నెల 16న యూట్యూబ్‌లోకి అప్ లోడ్ చేశారు. కేవలం 14రోజుల్లో ' వై దిస్ కొల కొల వెరి డీ..." గీతాన్ని 10 మిలియన్ మంది తిలకించడం విశేషం. అధికారికంగా పెట్టిన వీడియోను చూసిన వాళ్ళ సంఖ్యే ఇంత ఉంటే ఇంకా అనధికారికం ఇదే పాట వీడియోలనుగా పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ వీడియోలు చూసిన వారి సంఖ్యా కూడా బాగానే ఉంది.
అంతేనా కొలవరి పాటకు రీమిక్స్ అంటూ వచ్చినా, పేరడీ అంటూ ఏదీ వచ్చినా కూడా జనం ఆదరిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో విజువల్స్ కు కొలవరి పాటను కలిపి ఓ పేరడీ చేశారు. యూ ట్యూబ్ లో ఇప్పుడు ఈ పాట కూడా బాగా ఆకట్టుకుంటుంది. ధనుష్, శృతిహాసన్ జంటగా నటిస్తున్న '3" చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











