హాలీవుడ్‌లో ధనుష్‌పై ప్రశంసల వర్షం.. ఇంగ్లీష్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
విలక్షణ నటుడు ధనుష్ హాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఆయన నటించిన ది ఎక్ట్రార్డినరీ స్టోరీ ఆఫ్ ది ఫకీర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో భారతీయ వీధి సంగీతకారుడిగా ఓ విభిన్నమైన పాత్రను పోషించాడు. భారత్ నుంచి పారిస్‌కు వెళ్లిన క్రమంలో ధనుష్ ఎదుర్కొన్న అంశాల ఆధారంగా సినిమా తెరకెక్కింది. ఎక్ట్రార్డినరీ స్టోరీ ఆఫ్ ది ఫకీర్ సినిమాను దేశవ్యాప్తంగా జూన్ 21న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు.
తమిళంలో ఈ సినిమాకు వాజ్‌కై యా థేడి నానమ్ పోరెన్ అనే టైటిల్‌ను ఖరారు చేశాడు. కానీ ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌లో మాత్రం పక్కిరీ అని ఉండటం అనేక సందేహాలకు తావిచ్చింది. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే విడుదలైన ఎక్ట్రార్డినరీ స్టోరీ ఆఫ్ ది ఫకీర్ సినిమాలో ధనుష్ నటనపై దర్శకుడు కెన్ స్కాట్ ప్రశంసలు కురిపించారు. స్పెయిన్ ఇతర దేశాల్లోని ప్రేక్షకులను ధనుష్ ఆకట్టుకొన్నారు. సినిమాపై మంచి రివ్యూలు వచ్చాయి. ఇక ఇండియాలో ధనుష్ నటనకు ఎలాంటి స్పందన ఉంటుందోననే అంశం నాకు ఆసక్తిగా ఉంది అని కెన్ స్కాట్ వెల్లడించారు.

ప్రముఖ రచయిత రొమేనియన్ ప్యుర్టోలస్ రాసిన పుస్తకం ఆధారంగా ఎక్ట్రార్డినరీ స్టోరీ ఆఫ్ ది ఫకీర్ రూపొందింది. ఈ చిత్రంలో హలీవుడ్ నటుడు అలెగ్జాండ్రియా డబ్బారియో, ఉమా థుర్మాన్‌లను తీసుకోవాలని అనుకొన్నారు. చివరకు ధనుష్ వైపు మొగ్గుచూపి విభిన్నమైన పాత్రకు ఎంపిక చేశారు.
ఎక్ట్రార్డినరీ స్టోరీ ఆఫ్ ది ఫకీర్ తర్వాత ధనుస్ అసురన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకుడు. ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ చిత్రంలో నటించేందుకు రెడీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











