Dhanush's Thiruchitrambalam twitter review.. ధనుష్ ఎంట్రీ అలా.. రూమర్ల మధ్య ప్రేక్షకుల ముందుకు తిరు!
ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై మిత్రన్ ఆర్ జవహర్ దర్శకత్వంలో ధనుష్, రాశీఖన్నా, నిత్య మీనన్, ప్రియా భవానీ శంకర్ నటించిన తిరు (తమిళంలో తిరుచిత్రాంబలం) ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కళానిధి మారన్ నిర్మాతగా రూపొందిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఈ సినిమా గురించిన ఆసక్తికరమైన విషయాలు, సమాచారం మీ కోసం..
1.5 ఏళ్ల తర్వాత ధనుష్
తమిళ సూపర్ స్టార్ ధనుష్ నటించిన చిత్రాలు ఎక్కువగా ఇటీవల కాలంలో ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. 1.5 ఏళ్ల తర్వాత ధనుష్ నటించిన చిత్రం థియేట్రికల్ రిలీజ్ అవుతున్నది. దాంతో ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళనాడు వ్యాప్తంగా ఈ సినిమా సంబరాలు మొదలయ్యాయి.
మూడేళ్ల కష్టంతో తిరు
తిరుచిత్రాంబలం సినిమా మూడేళ్ల కష్టం. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరు చాలా కష్టపడి, అంకిత భావంతో పనిచేశారు. ఈ సినిమాను అద్భుతంగా రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. ఇక నుంచి ఈ సినిమాను ఆదరించే బాధ్యత మీదే. ఈ సినిమాలో భాగమైన ధనుష్ అనిరుధ్, చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు అని నిర్మాతలు చెప్పారు.
తమిళనాడులో భారీగా ఓపెనింగ్స్
తిరుచిత్రాంబలం సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు తమిళనాడుతోపాటు ఓవర్సీస్‌లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ధనుష్ ఫెర్ఫార్మెన్స్ గురించి భారీగా అంచనాలు ఉండటం, అనిరుధ్ పాటలు ఇప్పటికే జనంలోకి వెళ్లడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
తిరు మూవీపై రూమర్లు ఇలా
తిరుచిత్రాంబలం చిత్రాన్ని 2019లో సన్ పిక్చర్స్ ప్రారంభించింది. అయితే ఈ సినిమాకు తొలుత ధనుష్ స్వయంగా దర్శకత్వం వహిస్తారనే వార్త మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఆ వార్తలన్నీ రూమర్లుగానే ఉండిపోయాయి. ఈ సినిమా టైటిల్‌ను ఆగస్టు 5, 2021లో ప్రకటించారు.

ఓటీటీ రిలీజ్ తర్వాత
ధనుష్ నటించిన కర్ణన్ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయింది. ఆ తర్వాత జగమే తాంద్రియమ్, అత్రంగి రే, మారన్, ది గ్రే మ్యాన్ చిత్రాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. తాజాగా తిరుచిత్రాంబలం చిత్రం మళ్లీ థియేట్రికల్ రిలీజ్ అవుతున్నది.

హన్సిక మోత్వాని పేరు తెరపైకి
తిరుచిత్రాంబలం చిత్రంలో తొలుత హన్సిక మోత్వానిని అనుకొన్నారు. కానీ అనూహ్యంగా ఈ సినిమాలోకి నిత్య మీనన్, రాశీ ఖన్నా, ప్రియా భవానీ శంకర్ తెరపైకి వచ్చారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సన్ నెక్ట్స్ ఓటీటీ రిలీజ్
తిరుచిత్రాంబలం చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ హక్కులను సన్ పిక్చర్స్ తీసుకొన్నది. శాటిలైట్ హక్కులను సన్ టీవీ దక్కించుకొన్నది. ఈ సినిమా ఓటీటీ, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సన్ నెక్ట్స్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ తీసుకొన్నది.


Click it and Unblock the Notifications











