'కొలైవెరి డీ'పై 'సారీ' చెప్పిన ధనుష్
జావేద్ అక్తర్ చాలా గొప్ప వ్యక్తి. ఆయన నా పాటను వినడమే చాలా గొప్పగా భావిస్తున్నాను. ఆయన విమర్శలను నేను అంగీకరిస్తున్నాను. ఆ పాట బుద్ధిని, జ్ఞానాన్ని ఎద్దేవా చేస్తున్నట్లుగా ఉందని అన్నారు. అందుకు జావేద్ గారికి 'సారీ' చెబుతున్నాను. ఆయన మాటలన్నీ కరెక్టేనని నేను ఒప్పుకుంటున్నాను అంటూ ప్రముఖ తమిళ హీరో ధనుష్ అన్నారు. ఆయన తాజా సంచలనం 'కొలైవెరి డీ'పాటను జావేద్ అక్తర్ విమర్శిస్తూ స్టేట్ మెంట్ ఇచ్చారు. దానిపై ధనుష్ ఈ విధంగా స్పందించారు. జావేద్ అక్తర్ ఆ పాట గురించి మాట్లాడుతూ...''అందరూ చక్రవర్తి ధరించిన దుస్తులు బ్రహ్మాండంగా ఉన్నాయని అంటున్నారు. కానీ అక్కడ చక్రవర్తి నగ్నంగా కనిపిస్తున్నాడు. బాణీ చాలా సామాన్యంగా ఉంది. పాటలో నాణ్యత లేదు. పాడే తీరు నాసిరకంగా ఉంది. ఇక మాటలైతే బుద్ధిని, జ్ఞానాన్ని ఎద్దేవా చేస్తున్నట్లు హీనంగా ఉన్నాయి'' అన్నారు.
అయితే అంతా దీనికి ధనుష్ మండిపడతారనుకున్నారు. అయితే ధనుష్ చాలా తెలవిగా తన తప్పు ఒప్పుకుంటున్నానని సమాధానమిచ్చి ఆశ్చర్యపరిచారు. ఈ పాట నేపధ్యంలోకి వస్తే...ఓ సాదాసీదా అబ్బాయి. ప్రేమలో పడ్డాడు. కొన్ని కారణాలవల్ల ప్రేమలో ఓడిపోయాడు. బాధలో ఒక పాట పాడాడు. అదీ తంగ్లీష్ (తమిళ్ + ఇంగ్లీష్)లో. 'యో బోయిస్ అయామ్ సింగింగ్ ఎ సాంగ్. సూప్ సాంగ్..ఫ్లాప్ సాంగ్. వై దిస్ కొలావరి డి...... వైట్ స్కిన్ను గరలు. గరలు హార్టు బ్లాకు... ఐసు ఐసు మీటు.. మై ఫ్యూచర్ డార్కు... వై దిస్ కొలావరి డి...''. అలా సాగిపోతుందీ పాట. ఆ ఫ్లాప్ సాంగే ఇవాళ ఖండాలను దాటుకుని కుర్రకారునేగాక, అమితాబ్ వంటి సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంటోంది. యూ ట్యూబ్, ఫేస్‌బుక్కుల్లో కోలాహలం సృష్టిస్తోంది. ఇక 'వై దిస్ కొలావరి డి' అంటే అర్ధం ఏంటో తెలుసా? 'చంపెయ్యాలన్నంత కసి ఎందుకే!' అని. సరదాగా చేసిన ఒక పాట ప్రధానితో ఆతిధ్యం స్వీకరించటం దాకా వెళ్లిందంటే మామూలు విషయం కాదు కదా.


Click it and Unblock the Notifications











