twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీరో... షారుక్ ఖాన్-ధనుష్ మధ్య ట్వీట్స్

    By Bojja Kumar
    |
     Dhanush shares Zero teaser

    షారుక్ ఖాన్ హీగారో రూపొందుతున్న 'జీరో' మూవీ కొత్త టీజర్ ఈద్ సందర్భంగా విడుదల చేశారు. ఈ టీజర్లో సల్మాన్, షారుక్ కలిసి స్టెప్పులేస్తూ కనిపించడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఫ్యాన్స్ మాత్రమే కాదు తమిళ స్టార్ ధనుష్‌ను ఇది చూసి ఇంప్రెస్ అయ్యాడు. వెంటనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ టీజర్ షేర్ చేయడంతో పాటు తన తరుపున అభినందనలు తెలియజేశారు.

    ధనుష్ చేసిన ట్వీట్‌పై షారుక్ వెంటనే రియాక్ట్ అయ్యారు. 'నీ లాంటి టాప్ క్లాస్ యాక్టర్ నుండి అభినందనలు అందుకోవడం సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు, లవ్ యూ' అంటూ రిప్లై ఇచ్చారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ హాట్ టాపిక్ అయింది.

    ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. కత్రినా కైఫ్, అనుష్క శర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. మరుగుజ్జు పాత్రలో షారుక్ అభిమానులను ఎంటర్టెన్ చేయబోతున్నారు.

    షారుక్ సొంత బేనర్ రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్స్‌పై ఆయన భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదలవ్వబోతోంది.

    English summary
    The new teaser of Shah Rukh Khan's upcoming film Zero, which also features Salman Khan in a cameo, has become an instant hit across the country, and Tamil star Dhanush also looks mighty impressed by the teaser. He took to Twitter to share the teaser and congratulated Shah Rukh Khan and director Anand L Rai for the impressive promo.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X