భార్య సమక్షంలోనే సంచలనం కలిగిస్తున్న హీరోహీరోయిన్ ల రొమాన్స్...!?
రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం '3' షూటింగులో ఉండగానే సంచలనం క్రియేట్ చేస్తోంది. ఐశ్వర్య భర్త ధనుష్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. సినిమా పట్ల ఆసక్తిని కూడా కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంచితే, ఇందులో ధనుష్, శృతి కలిసి ఓ లిప్ లాక్ కిస్ దృశ్యంలో నటించనున్నారని వార్తలొస్తున్నాయి.
అయితే, డైరెక్టర్ ఐశ్వర్య మాత్రం ఈ వార్తల్ని ఖండించడమూ లేదు, అలా అని 'అవుననీ' చెప్పడం లేదు. దాని గురించి అప్పుడే ఎందుకని నవ్వుతూ తప్పించుకుంటోంది. 'ఒకవేళ కథ డిమాండ్ చేస్తే కనుక వాళ్ళిద్దరూ లిప్ లాక్ చేస్తా'రని తెలివిగా సమాధానం చెప్పింది. ఇలాంటి విషయాలు ఇవాళ, రేపు సర్వసాధారణం అని అన్నారు. సినిమాను కోట్లాదిమంది వీక్షిస్తారన్న విషయం తెలియనిది కాదన్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే '3" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఐశ్వర్య తెలిపారు. పేరులోనే కొత్తదనాన్ని నింపుకున్న ఈ '3' సినిమా రొమాంటిక్ కామెడీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఆర్‌కే ప్రొడక్షన్స్ పతాకంపై ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరి రాజ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.


Click it and Unblock the Notifications











