ధనుష్ నోట రజనీ పాట.. సిగ్గుతో భార్య ఐశ్వర్య బుగ్గలు ఎరుపెక్కి...
తమిళ స్టార్ హీరో ధనుష్ తెరపైన ఏ రేంజ్‌లో విజృంభిస్తారో మనకు తెలిసిందే. కానీ రియల్ లైఫ్‌లో చాలా కామ్‌గా నిరాడంబరంగా కనిపిస్తారు. కొన్నిసార్లు ఎలాంటి ఎమోషన్స్ లేకుండా కనిపించే ధనుష్ తాజాగా ఫుల్ రొమాంటిక్‌గా మారిపోయారు. భార్య ఐశ్వర్య కోసం పాట పడి ఆకట్టుకొన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వీడియోలో కనిపించిన ప్రకారం.. రజనీకాంత్ నటించిన పేట్టా సినిమాలోని ఇలమై థిరుంబుదే పాటను పాడి భార్యను సంతోషంలో ముంచెత్తారు. తన తండ్రికి సంబంధించిన రొమాంటిక్ పాటను ధనుష్ పాడటంతో సిగ్గుతో మొగ్గైపోయారు. ప్రస్తుతం ఐశ్వర్య, ధనుష్‌కు సంబంధించిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో చాలా మందిని ఆకట్టుకొంటున్నది. అయితే ఏ సందర్భంగా ఈ వీడియో షూట్ చేశారనే విషయంపై అంతగా సమాచారం లేదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ధనుష్ విషయానికి వస్తే.. హాలీవుడ్‌లో రూపొందుతున్న ది గ్రే మ్యాన్ సినిమాకు సంబంధించిన షూటింగు కోసం యూఎస్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన కర్ణన్ చిత్రం ద్వారా ధనుష్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతేకాకుండా ఇటీవల ఆయన నటించిన అసురన్ చిత్రానికి జాతీయ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. ఇంకా తమిళంలో కార్తీక్ నరేన్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ నటించనున్నారు.


Click it and Unblock the Notifications











