Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అమితాబ్ నే కాదు ఆంధ్ర దేశాన్నే ఆకట్టుకున్న‘కోలవేరి డి’సాంగ్..!
తమిళ చిత్రసీమలో తాజా సంచలనం 'కోలవేరి డి" పాట. త్వరలో విడుదల కానున్న '3" చిత్రంలోని 'కోలవేరి డి" పాటను తమిళ నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ రాసి స్వయంగాపాడారు. ఇటీవలి కాలంలో మొట్టమొదటిసారిగా ఒక తమిళ పాట మొత్తం భారత దేశాన్ని ఒక ఊపు ఊపేస్తుంది. ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తున్న ఈ “వై దిస్ కొలవెరి డి" పాటని మీరు విన్నారా? రజినికాంత్ అల్లుడు ధనుష్ పాడుతూ ఉన్న ఈ వీడియోని సోనీ మ్యూజిక్ విడుదల చేసింది.
గత ఐదు రోజుల నుండి ఇంటర్నెట్లో, టీవీల్లో ఎక్కడ చుసిన ఈ పాటే మార్మోగిపోతుంది. ఈ వీడియోలో ఆయనతో పాటు ఆయన భార్య ఐశ్వర్య ధనుష్, శృతి హసన్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా ఉన్నారు. ఈ వీడియో యూట్యుబ్ లో వారం రోజుల్లోనే 15 లక్షల హిట్స్ సాధించింది. సిఎన్ఎన్-ఐబీఎన్, ఎన్డీటీవీ జాతీయ ఛానళ్ళు కూడా ఈ పాటని ప్రసారం చేసాయి. ఆనంద్ మహీంద్రా వంటి బిజినెస్ మాన్ కూడా ట్విట్టర్లో ఈ పాటని గురించి చెప్పారు. అంతేకాదు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌ను అమితంగా ఆకట్టుకుంది. అమితాబ్‌ను ఆకట్టుకోవడం.. బిగ్ బి అభినందించడం గొప్ప అదృష్టమని వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా ఉరఫ్ ధనుష్ అన్నారు. తాను పాడిన పాట యావత్ భారతదేనాన్ని ఆకట్టుకున్నందకు చాలా ఆనందంగా ఉందని వారందనికి నా కృతజ్ఞతలు తెలుతున్నారు ధనుష్.