twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమితాబ్‌ నే కాదు ఆంధ్ర దేశాన్నే ఆకట్టుకున్న‘కోలవేరి డి’సాంగ్..!

    By Sindhu
    |

    తమిళ చిత్రసీమలో తాజా సంచలనం 'కోలవేరి డి" పాట. త్వరలో విడుదల కానున్న '3" చిత్రంలోని 'కోలవేరి డి" పాటను తమిళ నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ రాసి స్వయంగాపాడారు. ఇటీవలి కాలంలో మొట్టమొదటిసారిగా ఒక తమిళ పాట మొత్తం భారత దేశాన్ని ఒక ఊపు ఊపేస్తుంది. ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తున్న ఈ “వై దిస్ కొలవెరి డి" పాటని మీరు విన్నారా? రజినికాంత్ అల్లుడు ధనుష్ పాడుతూ ఉన్న ఈ వీడియోని సోనీ మ్యూజిక్ విడుదల చేసింది.

    గత ఐదు రోజుల నుండి ఇంటర్నెట్లో, టీవీల్లో ఎక్కడ చుసిన ఈ పాటే మార్మోగిపోతుంది. ఈ వీడియోలో ఆయనతో పాటు ఆయన భార్య ఐశ్వర్య ధనుష్, శృతి హసన్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా ఉన్నారు. ఈ వీడియో యూట్యుబ్ లో వారం రోజుల్లోనే 15 లక్షల హిట్స్ సాధించింది. సిఎన్ఎన్-ఐబీఎన్, ఎన్డీటీవీ జాతీయ ఛానళ్ళు కూడా ఈ పాటని ప్రసారం చేసాయి. ఆనంద్ మహీంద్రా వంటి బిజినెస్ మాన్ కూడా ట్విట్టర్లో ఈ పాటని గురించి చెప్పారు. అంతేకాదు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌ను అమితంగా ఆకట్టుకుంది. అమితాబ్‌ను ఆకట్టుకోవడం.. బిగ్ బి అభినందించడం గొప్ప అదృష్టమని వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా ఉరఫ్ ధనుష్ అన్నారు. తాను పాడిన పాట యావత్ భారతదేనాన్ని ఆకట్టుకున్నందకు చాలా ఆనందంగా ఉందని వారందనికి నా కృతజ్ఞతలు తెలుతున్నారు ధనుష్.

    English summary
    Why this kolaveri di, Dhanush’s song from 3 is already making waves all over the country. After it was leaked online, the makers decided to release it officially and it has been available for digital downloads for the past five days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X