ఊహించని విధంగా కెప్టెన్ మిల్లర్ తెలుగు ట్రైలర్.. ధనూష్ నుంచి అసలైన ట్రీట్
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను, మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు విలక్షణ నటుడు ధనూష్. అదే సమయంలో ఎన్నో దేశాల్లో ఫాలోయింగ్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇలా ఇటీవలే ధనూష్ 'కెప్టెన్ మిల్లర్' అనే ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీలో నటించాడు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనూష్ హీరోగా.. అరుణ్ మతేశ్వరన్ తెరకెక్కించిన చిత్రమే 'కెప్టెన్ మిల్లర్'. బ్రిటీష్ నేతృత్వంలోని భారత సైన్యంపై దురాగతాన్ని చూసి పోరాడే వ్యక్తి కథతో ఈ సినిమా తెరకెక్కింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఆరంభం నుంచీ నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కించి సంక్రాంతి కానుకగా విడుదల చేశారు.

ధనూష్ నటించిన 'కెప్టెన్ మిల్లర్' సినిమాను తెలుగులో కూడా సంక్రాంతికే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, ఇక్కడ థియేటర్ల ఇష్యూ ఉండడంతో జనవరి 25వ తేదీకి వాయిదా వేశారు. ఈ క్రమంలోనే తమిళ వెర్షన్‌ను మాత్రం విడుదల చేశారు. దీనికి అక్కడ డీసెంట్ టాక్‌తో పాటు రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద మోస్తరు రన్‌ను కొనసాగిస్తోంది.
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'కెప్టెన్ మిల్లర్' మూవీ తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. తమిళ వెర్షన్‌కు కొన్ని మార్పులు చేసి దీన్ని వదిలారు. ఇది ఆద్యంతం ఆకట్టుకునేలా యాక్షన్ సీక్వెన్స్‌తో కట్ చేశారు.
తాజాగా విడుదలైన 'కెప్టెన్ మిల్లర్' ట్రైలర్‌లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా ధనూష్ కనిపించిన మూడు డిఫరెంట్ లుక్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ఈ ట్రైలర్ తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచే విధంగా ఉందని చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉండగా.. 'కెప్టెన్ మిల్లర్' చిత్రాన్ని సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా.. శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు.


Click it and Unblock the Notifications











